Hair Care Tips: జుట్టు బాగా రాలిపోతుందా?.. అయితే ఆపిల్‌ సైడర్‌ వెనిగర్‌తో ఇలా చెక్‌ పెట్టండి..

Hair fall:ఆపిల్ సైడర్‌ వెనిగర్ అంటే జుట్టు సంరక్షణలో సమర్థంగా పనిచేస్తుందని నిపుణులు చెబుతుంటారు. ముఖ్యంగా హెయిర్‌ఫాల్‌ను నిరోధించడంలో మెరుగ్గా పనిచేస్తుందంటున్నారు. మరి జుట్టు సంరక్షణ కోసం దీనిని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం రండి.

|

Updated on: Mar 23, 2022 | 7:55 AM

 కలబందలో చాలా బ్యూటీ బెనిఫిట్స్ ఉన్నాయి. అందుకే ఇది జుట్టు సంరక్షణలో కూడా అత్యుత్తమమైనదిగా పరిగణిస్తారు స్కిన్‌ కేర్‌ నిపుణులు. ఒక పాత్రలో రెండు చెంచాల అలోవెరా జెల్ తీసుకుని అందులో కొబ్బరి పాలను కలపండి. ఇప్పుడు ఒక చెంచా వెనిగర్ జోడించిన తర్వాత, ఈ మిశ్రమాన్ని హెయిర్ మాస్క్‌గా జుట్టుకు పట్టిచండి.

1 / 6
 ఈ హోం రెమిడీ ఇంకా సులభం. ఇంందుకోసం స్నానపు నీటిలో ఒక మూత యాపిల్ సైడర్ వెనిగర్ వేసి, దానితో స్నానం చేయాలి. లేకపోతే ఒక గిన్నెలో కొద్దిగా నీళ్లు తీసుకుని అందులో రెండు చెంచాల వెనిగర్ మిక్స్ చేసి తలకు పట్టించి మసాజ్ చేయాలి. ఆ తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి.

2 / 6
కురుల సంరక్షణలో ఆపిల్ సైడర్ వెనిగర్‌ సమర్థంగా పనిచేస్తుంది

3 / 6
కొబ్బరి నూనెతో: మీరు ఒక గిన్నెలో కొద్దిగా వెనిగర్ తీసుకుని, అందులో కొద్దిగా కొబ్బరి నూనె కలపాలి. మీకు కావాలంటే, మీరు దీనికి బేకింగ్ సోడాను కూడా జోడించవచ్చు. ఈ పేస్ట్‌ను తలపై 15 నిమిషాల పాటు అప్లై చేసిన తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. కొన్ని రోజుల్లోనే జుట్టు రాలడం తగ్గుతుంది.

4 / 6
తేనె చర్మంతో పాటు జుట్టుకు కూడా ఆరోగ్యాన్ని అందిస్తుంది. ఇందుకోసం ఒక పాత్రలో రెండు చెంచాల తేనె తీసుకొని దానికి ఒక చెంచా వెనిగర్ కలపండి. ఈ మిశ్రమాన్ని బ్రష్ సహాయంతో జుట్టుకు పట్టించాలి. దీన్ని రెగ్యులర్‌గా ఉపయోగించడం వల్ల ఉత్తమ ఫలితాలను పొందవచ్చు.

5 / 6
 ఈ హోం రెమిడీకి నిమ్మ, వెనిగర్‌ తో పాటు ఆలివ్ నూనె కూడా అవసరం. ఇందుకోసం ఒక గిన్నెలో ఆలివ్ ఆయిల్ తీసుకుని అందులో నిమ్మరసం, వెనిగర్ కలపాలి. ఈ మిశ్రమాన్ని జుట్టుకు పట్టించి అరగంట పాటు అలాగే ఉంచాలి. ఆతర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. వారంలో కనీసం ఒకసారైనా ఇలాచేస్తే హెయిర్‌ఫాల్‌ సమస్య తగ్గుతుంది.

6 / 6
Follow us