Covaxin Trial : కోవాగ్జిన్ కు మరో గుడ్ న్యూస్, టీకా సేఫ్టీపై లాన్సెట్ జర్నల్ లో ఫుల్ మార్క్స్

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో గుడ్‌న్యూస్‌. కోవాగ్జిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి ఫలితాలను లాన్సెట్‌..

Covaxin Trial : కోవాగ్జిన్ కు మరో గుడ్ న్యూస్, టీకా సేఫ్టీపై లాన్సెట్ జర్నల్ లో ఫుల్ మార్క్స్
Follow us

|

Updated on: Jan 22, 2021 | 9:36 PM

కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు సంబంధించి మరో గుడ్‌న్యూస్‌. కోవాగ్జిన్‌తో ఎలాంటి సైడ్‌ ఎఫెక్ట్స్‌ లేవని తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించి ఫలితాలను లాన్సెట్‌ జర్నల్‌లో ప్రచురించారు. పూర్తిగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఈ టీకాను భారత్‌ బయోటెక్‌, ఐసీఎంఆర్‌, నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ తయారు చేశాయి. కాగా, కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌కు అత్యవసర వినియోగానికి అనుమతినివ్వడంపై విమర్శలు వచ్చాయి. మూడో దశ క్లినకల్‌ ట్రయల్స్‌ పూర్తి కాకుండానే వ్యాక్సిన్‌ వినియోగానికి ఎలా అనుమతినిచ్చారని విపక్షాలు ప్రభుత్వాన్ని ప్రశ్నించాయి. అయితే టీకా చాలా సేఫ్‌ అని భారత్‌ బయోటెక్‌ స్పష్టం చేసింది. వ్యాక్సిన్‌ తీసుకున్న వాలంటీర్లు అస్వస్థతకు గురికావడడానికి టీకాతో సంబంధం లేదని వివరణ ఇచ్చింది. దేశవ్యాప్తంగా 11 ఆస్పత్రుల్లో తొలిదశ క్లినికల్‌ ట్రయల్స్‌ను విజయవంతంగా నిర్వహించారు. 18-55 ఏళ్ల మధ్య ఉన్న వాలంటీర్లపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించారు. కోవాగ్జిన్‌ వ్యాక్సిన్‌ బీబీవీ 152 వ్యాక్సిన్‌ అని పిలుస్తున్నారు. వ్యాక్సిన్‌ తీసుకున్న వాళ్లలో వ్యాధి నిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ప్రకటించారు. కాకపోతే వ్యాక్సిన్‌ వేసిన చోట కొంచెం నొప్పి, తలనొప్పి, జ్వరం లాంటి లక్షణాలు కొద్దిమంది వాలంటీర్లలో కన్పించాయి. ఇకిప్పుడు, ఏపీ, తెలంగాణలో కోవాగ్జిన్‌ టీకాల పంపిణీకి రంగం సిద్దమైంది. తెలంగాణ కు మరిన్ని కోవాగ్జిన్ డోసులు చేరుకున్నాయి. భారత్ బయోటెక్ నుంచి కోఠి లోని కోల్డ్ స్టోరేజ్ కి చేరుకున్నాయి. ఏపీలో ఇప్పటికే కొవాగ్జిన్‌ టీకాను తొలిదశలో హెల్త్‌వర్కర్లకు ఇచ్చారు. తెలంగాణలో రెండోదశలో కొవాగ్జిన్‌ టీకాను ఉపయోగిస్తున్నారు.