ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో 4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు..!

కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తున్న ప్రపంచానికి ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ కీలక ప్రకటన చేసింది.

ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో 4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు..!
Follow us

|

Updated on: Oct 28, 2020 | 1:40 PM

కరోనా మహమ్మారి నుంచి ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని ఎదురుచూస్తున్న ప్రపంచానికి ప్రముఖ ఫార్మా కంపెనీ ఫైజర్ కీలక ప్రకటన చేసింది. ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో 4 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులు సప్లై చేయగలమని తెలిపింది. టీకా లభ్యతపై ఫైజర్ కంపెనీ సీఈఓ ఆచూతూచి స్పందించారు. అంతా అనుకున్నట్టు జరిగి క్లినికల్ ట్రయల్స్ పూర్తయి కరోనా టీకాకు ప్రభుత్వ అనుమతులు లభిస్తే..ఈ ఏడాది చివరికల్లా అమెరికాలో ఏకంగా 4 కోట్ల టీకా డోసులను పంపిణీ చేయగలమని ఫైజర్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆల్బర్ట్ బౌర్లా తెలిపారు. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో 10 కోట్ల టీకా డోసులు సిద్దం చేస్తున్నట్లు తెలిపారు. టీకా సామర్థ్యాన్ని అంచనా వేయడంలో కంపెనీ ఇంకా కీలక ప్రమాణాలను చేరుకోలేదని బౌర్లా చెప్పారు. ఫైజర్ అక్టోబర్ లో పూర్తి డేటాను వెల్లడిస్తామని గతంలోనే చెప్పామని ఆయన పేర్కొన్నారు.

అనంతరం.. అత్యవసర సందర్భాల్లో టీకాను వినియోగించేందుకు వీలుగా ఎమర్జెన్సీ అనుమతి కోసం నవంబర్‌ మూడో వారంలో దరఖాస్తు చేసుకుంటామని తెలిపారు. టీకా కచ్చితంగా పనిచేస్తుందని మీరు బలంగా విశ్వసిస్తున్నారా అని విలేకరులు అడిగిన ప్రశ్నకు సీఈఓ ఆచితూచి స్పందించారు. ఈ విషయంలో నేను అతివిశ్వాసాన్ని ప్రదర్శిచదలుచుకోలేదు. అయితే, తాము రూపొందించిన వ్యాక్సిన్ పనిచేసే అవకాశం ఉందని అనుకుంటున్నామని ఆయన వ్యాఖ్యానించారు.

ప్రపంచం వ్యాప్తంగా కరోనా కారణంగా సాధారణ వైద్య సేవల్లో అనేక ఆటంకాలు ఏర్పడిన విషయం తెలిసిందే. దీంతో ఇతర ఔషధాలకు డిమాండ్ తగ్గింది. ఇది ఫైజర్ లాభాలపై పెను ప్రభావం చూపింది. మునపటితో పోలిస్తే ఈ ఏడాది మూడో త్రైమాసికంలోనూ సంస్థ లాభాల్లో క్షీణత నమోదైంది. కంపెనీ వెల్లడించిన గణాంకాల ప్రకారం.. కరోనా కారణంగా సంస్థ లాభాల్లో ఏకంగా 71 శాతం మేర కోత పడి 2.2 బిలియన్ డాలర్లకు చేరుకుంది. మొత్తంగా ఆదాయాలు నాలుగు శాతం తగ్గి 12.1 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి.

క్యాన్సర్ డ్రగ్ ఇబ్రాన్స్, ప్రతిస్కందక ఎలిక్విస్, ఇతర ఔషధాల కోసం మంచి అమ్మకాల కారణంగా ఫైజర్ తన బయోఫార్మా వ్యాపారంలో బలమైన రాణిస్తుంది.

పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!