కోవిడ్ వ్యాక్సీన్ పై త్వరలో ఫైజర్, ఇండియా మధ్య చర్చలు

అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, జర్మన్ బయో టెక్ సంస్థ..బయో ఎన్ టెక్ అభివృధ్ది పరుస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ 90 శాతం మేలైనదని తేలింది. ఈ కారణంగా దీనికోసం ఇండియా ఆతృతగా వేచి చూస్తున్నప్పటికీ..ఇప్పట్లో ఈ టీకామందు అందుబాటులోకి  వచ్ఛేలా లేదు. ఏమైనప్పటికీ తాము త్వరలో చర్చలు జరుపుతామని ఫైజర్, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ కంపెనీ తాత్కాలిక ఫలితాలను విడుదల చేయగా ..40 వేల మంది వలంటీర్లలో కేవలం 94 మందికి మాత్రమే […]

కోవిడ్ వ్యాక్సీన్ పై త్వరలో ఫైజర్, ఇండియా మధ్య చర్చలు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Nov 11, 2020 | 7:04 PM

అమెరికాకు చెందిన ఫైజర్ కంపెనీ, జర్మన్ బయో టెక్ సంస్థ..బయో ఎన్ టెక్ అభివృధ్ది పరుస్తున్న కోవిడ్ వ్యాక్సీన్ 90 శాతం మేలైనదని తేలింది. ఈ కారణంగా దీనికోసం ఇండియా ఆతృతగా వేచి చూస్తున్నప్పటికీ..ఇప్పట్లో ఈ టీకామందు అందుబాటులోకి  వచ్ఛేలా లేదు. ఏమైనప్పటికీ తాము త్వరలో చర్చలు జరుపుతామని ఫైజర్, ఆరోగ్య శాఖ అధికారులు ప్రకటించారు. ఇప్పటివరకు ఈ కంపెనీ తాత్కాలిక ఫలితాలను విడుదల చేయగా ..40 వేల మంది వలంటీర్లలో కేవలం 94 మందికి మాత్రమే దీన్ని ఇచ్చారట.. అంటే  దీని సామర్థ్యంపై ఇంకా సందేహాలు ఉన్నాయని వెల్లడవుతోంది. మొదట ఫైజర్ సంస్థ రెండు నెలల సేఫ్టీ ఫాలో అప్ ను సమర్పించాల్సి ఉంటుంది.  ఈ వ్యాక్సీన్  రక్షణ పరంగా ఎంతవరకు ఉపయోగపడుతుందన్నది తేలవలసి ఉంది. ఏది ఎలా ఉన్నా..ప్రస్తుత ఫలితాలు ఇంకా క్లారిటీ ఇవ్వలేదని  కొంతమంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పైగా అమెరికా రెగ్యులేటరీ నుంచి ఇంకా అనుమతి కూడా రావాల్సి ఉంది.