Breaking News
  • కృష్ణాజిల్లా: గన్నవరంలో విషాదం. చెరువులో దూకి డిగ్రీ విద్యార్థి మురళి ఆత్మహత్య. ఎస్సై నారాయణమ్మ భర్త వేధింపులే కారణమంటూ.. వాయిస్‌ మెసేజ్‌ పెట్టిన మురళి.
  • తూ.గో: మంత్రి విశ్వరూప్‌కు హైకోర్టులో చుక్కెదురు. అమలాపురం ల్యాండ్‌ మార్క్‌ శుభకలశంను కూల్చొద్దని హైకోర్టు స్టే. హైకోర్టులో పిటిషన్ వేసిన మాజీ మున్సిపల్‌ చైర్మన్ యాళ్ల నాగ సతీష్.
  • గుంటూరు: ఇసుక విధానం లోపభూయిష్టంగా ఉంది-కళా వెంకట్రావ్‌. ఉచిత ఇసుక విధానం ఒక్కటే కొరతను తీరుస్తుంది. నియోజకవర్గాల వారీగా ఇసుక రీచ్‌లు పెట్టి అవినీతికి తెరలేపారు. 50 మంది చనిపోయిన తర్వాత తెచ్చిన పాలసీ దారుణంగా ఉంది. ప్రభుత్వం క్షేత్రస్థాయిలో విచారణ జరిపి వాస్తవాలు తెలుసుకోవాలి. ఇసుక ధర సామాన్యుడికి అందుబాటులో ఉండాలి-కళా వెంకట్రావ్‌.
  • అనంతపురం: నియోజకవర్గానికో వ్యవసాయ మార్కెట్‌ కమిటీ-బొత్స. అనంతపురం జిల్లాలో మూడు వ్యవసాయ మార్కెట్‌ కమిటీలు ఏర్పాటు. వరదలు తగ్గడంతో ఇసుక అందుబాటులోకి వస్తోంది-మంత్రి బొత్స. మరో మూడు రోజుల్లో ఇసుక కొరతను పూర్తిగా అధిగమిస్తాం-బొత్స. పరస్పర అంగీకారంతోనే సింగపూర్‌తో ఒప్పందం విరమించుకున్నాం. పెట్టుబడులు పెడతామని సింగపూర్‌ మంత్రి చెబుతున్నారు-బొత్స.
  • తూ.గో: రామచంద్రపురం మండలం మాలపాడులో దారుణం. యువతిపై పాలిక రాజు అనే వ్యక్తి పలుమార్లు అత్యాచారం. యువతిని ఫొటోలు తీసి బెదిరించి పలుసార్లు అఘాయిత్యం. ఏడు నెలల గర్భవతి అయ్యాక గుర్తించిన తల్లిదండ్రులు. జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన యువతి తల్లిదండ్రులు. కేసునమోదు చేసిన రామచంద్రపురం పోలీసులు.
  • ఢిల్లీ: సోనియాగాంధీతో ఎన్సీపీ అధినేత శరద్‌ పవార్‌ భేటీ. మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటు, ఉమ్మడి కార్యాచరణపై చర్చ.
  • ఆర్టీసీ సమ్మెపై విచారణను ముగించిన హైకోర్టు. హైకోర్టుకు కొన్ని పరిమితులున్నాయి. పరిధిదాటి ముందుకు వెళ్లలేం-హైకోర్టు. సమ్మెపై ఎవరికీ ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసిన హైకోర్టు. ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వలేమన్న హైకోర్టు. సమస్య పరిష్కరించాలని కార్మికశాఖ కమిషనర్‌కు హైకోర్టు ఆదేశం. 2 వారాల్లోగా సమస్య పరిష్కరించాలన్న హైకోర్టు. రూట్స్‌ ప్రైవేటీకరణ పిటిషన్‌, ఆత్మహత్యలపై రేపు విచారణ. కార్మికుల ఆత్మహత్యలపై కౌంటర్‌ దాఖలు చేయాలని.. ప్రభుత్వం, ఆర్టీసీ కార్పొరేషన్‌కు హైకోర్టు ఆదేశం.

పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్… వెంటనే ఇలా చేయండి.. లేదంటే నష్టమే!

2018-19 ఏడాదికి గానూ ఉద్యోగుల భవిష్యనిధిపై (ఈపీఎఫ్‌) వడ్డీ రేటును ప్రభుత్వం పెంచింది. లోగడ ఉన్న 8.55 శాతాన్ని 8.65 శాతానికి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఈ ప్రయోజననం పొందాలంటే కచ్చితంగా ఒక పని మాత్రం చేయాలి. ఈపీఎఫ్‌వో యూఏన్ యాక్టివేషన్ చేసుకున్న ఉద్యోగులకు మాత్రమే పెరిగిన వడ్డీ ప్రయోజనం లభిస్తుంది. అంటే కంపెనీ నుంచి యూఏఎన్ నెంబర్ ఉన్న వారికే వడ్డీ పెంపు వర్తిస్తుంది. మీకు యూఏఎన్ నెంబర్ లేకపోతే ఈ ప్రయోజనం కోసం వేచిచూడాల్సిందే. యూఏఎన్ లేకపోతే మీ కంపెనీని అడిగి ఆ నెంబర్ తీసుకోండి. తర్వాత ఆన్‌లైన్‌లో దాన్ని యాక్టివేట్ చేసుకోండి. 20 మంది కన్నా ఎక్కువ ఉద్యోగులను కలిగిన కంపెనీలు కచ్చితంగా వారికి ఈపీఎఫ్‌వోలో చందాదారులగా చేర్చాలి.

కంపెనీ ఈపీఎఫ్‌వో వద్ద రిజిస్టర్ అయితే అప్పుడు ఆ కంపెనీలో పనిచేసే ఉద్యోగులకు బేసిక్ వేతనం రూ.15,000 వరకు ఉంటుంది. అలాగే వీరు ఈపీఎఫ్‌లో కూడా చేరాలి. ఈపీఎఫ్ ఫండ్‌లో ఎంప్లాయీ, కంపెనీ 12 శాతం చొప్పున జమచేయాల్సి ఉంటుంది. పీఎఫ్ అకౌంట్ కలిగిన ప్రతి ఒక్కరికీ ఈపీఎఫ్‌వో యూఏఎన్ నెంబర్‌ను కేటాయిస్తుంది. దీంతో ఉద్యోగులు ఆన్‌లైన్‌లోనే పీఎఫ్‌ను క్లెయిమ్ చేసుకోవచ్చని పేర్కొన్నారు. ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌కు వెళ్లి యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవచ్చు. యూఏఎన్ నెంబర్‌ను యాక్టివేట్ చేసుకోవాలంటే యూఏఎన్ నెంబర్, మెంబర్ ఐడీ, ఆధార్ నెంబర్, పాన్ నెంబర్ వంటి వివరాలు అవసరం అవుతాయి. మీరు వెంటనే కంపెనీ హెచ్ఆర్ అధికారులను అడిగి యూఏఎన్ నెంబర్ తీసుకోండి. ఈపీఎఫ్‌వో పోర్టల్‌కు వెళ్లి దాన్ని యాక్టివేట్ చేసుకోండి.