ధరాఘాతం… పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు… పెట్రోల్ లీటరుపై 19 పైసలు, డీజీల్ లీటరుపై 24 పైసల పెరుగుదల…

దేశీయ చమరు సంస్థలు వినియోగదారుల వెన్నును ధరల పెంపుతో విరుస్తున్నాయి. నవంబర్ 27న చమరు సంస్థ మరోసారి పెట్రోల్, డీజీల్ ధరలను పెంచాయి.

  • Umakanth Rao
  • Publish Date - 4:28 pm, Fri, 27 November 20

పెట్రోల్, డీజీల్ ధరాఘాతుకానికి సామాన్య వాహనదారుడు విలవిలలాడుతున్నాడు. అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ ధరలు తగ్గుతూ ఉన్నా దేశీయ చమరు సంస్థలు మాత్రం వినియోగదారుల వెన్నును ధరల పెంపుతో విరుస్తున్నాయి. తాజాగా, నవంబర్ 27న చమరు సంస్థ మరోసారి పెట్రోల్, డీజీల్ ధరలను పెంచాయి.

పెట్రోల్ పై 19 పైసలు… డీజీల్ పై 24 పైసలు…

నవంబర్ 26న పెట్రోల్ ధర దేశీయంగా రూ.81.70 కాగా, నవంబర్ 27న 19 పైసలు పెరిగి రూ.81.89 అయ్యింది. ఇక డీజీల్ ధర నవంబర్ 26న రూ.71.62 కాగా, 27న ఆ ధర 24 పైసలు పెరిగి రూ.71.86 అయ్యింది. ఐదు రోజుల వ్యవధిలో లీటర్ పెట్రోల్ ధర 53పైసలు పెరగగా, డీజీల్ లీటర్ ధర నవంబర్ నెలలోనే అత్యధికంగా 95 పైసలు పెరిగింది. మొత్తంగా వారం వ్యవధిలో పెట్రోల్ లీటర్ ధర 83 పైసలు పెరగగా, డీజీల్ లీటర్ ధర 1.40 పైసలు పెరిగింది.

అంతర్జాతీయంగా ధరలు అలానే ఉన్నా…

అంతర్జాతీయంగా సెప్టెంబర్ 22 నుంచి ప్రెటోల్ ధర, అక్టోబర్ 2 నుంచి పైసా పెరగలేదు. కానీ దేశంలోని చమరు సంస్థలు పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించకపోగా… రోజు రోజుకు ధరలను పెంచుకుంటు పోతూ వినియోగదారుడి జేబుకు చిల్లు పెడుతున్నాయి. క్రూడ్ ఆయిల్ ధర నవంబర్ లో బారల్ కు 48 డాలర్లుగానే ఉంది. నెలల వ్యవధిలో బారల్ ధరలో ఎలాంటి మార్పు రాలేదు. అయితే అంతకు ముందు నెలలో క్రూడ్ ఆయిల్ ధర బారల్ కు 43 డాలర్లుగానే ఉంది. అయితే అంతర్జాతీయంగా ఆయిల్ ధరలు పెరిగాయి… అందుకే ధరలు పెంచుతున్నామంటున్న చమరు సంస్థలు, అదే అంతర్జాతీయ మార్కెట్ లో క్రూడ్ ఆయిల్ ధర తగ్గినప్పుడు మాత్రం పెట్రోల్, డీజీల్ ధరలను తగ్గించకుండా వినియోగదారులను మోసం చేస్తున్నాయి.