వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు… బాదుడే.. బాదుడు..

చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను వరుసగా ఎనిమిదో రోజు కూడా పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి..

వరుసగా ఎనిమిదో రోజు పెట్రోల్, డీజిల్ రేట్లు... బాదుడే.. బాదుడు..
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Jun 14, 2020 | 9:09 AM

చమురు కంపెనీలు పెట్రోల్, డీజిల్ రేట్లను వరుసగా ఎనిమిదో రోజు కూడా పెంచాయి. వివిధ మెట్రో నగరాల్లో పెట్రోల్ ధర లీటర్‌కు రూ. 62-64 పైసలకు పెరగగా, డీజిల్ ధర రూ. 64-66 పైసలకు పెరిగింది. పెరిగిన ధరల ప్రకారం దేశ రాజధాని ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75.78 చేరగా.. డీజిల్ రూ. 74.03కి చేరుకుంది. అలాగే ఆర్ధిక రాజధాని ముంబైలో లీటర్ పెట్రోల్ రూ. 83.70కి పెరగగా.. డీజిల్ ధర రూ. 72.64కి పెరిగింది. కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ. 77.64 ఉండగా.. డీజిల్ రూ.69.80 ఉంది.

ఇక చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ. 79.53 పెరగ్గా.. డీజిల్ రూ. 72.18కి పెరిగింది. బెంగళూరులో లీటరు పెట్రోల్ ధర రూ. 78.23కి చేరగా.. డీజిల్ రూ. 70.39కి చేరింది. కాగా, గత ఎనిమిది రోజుల్లో పెట్రోల్ ధర లీటరుకు రూ. 4.52 పెరగగా, డీజిల్ లీటరుకు రూ. 4.64 పెరిగింది. దేశ వ్యాప్తంగా స్థానిక పన్నుల్లో వ్యత్యాసాలు వల్లే ఆయా చోట్లలో ధరలు మార్పు ఉంటోందని చమురు కంపెనీలు చెబుతున్నాయి. వల్ల ఆయా చోట్ల ధరల్లో మార్పు ఉంటుందని చమురు కంపెనీలు వెల్లడించాయి.