48 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఇక వాయింపేనా !

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. గత 48 రోజులపాటు నిలకడగా ఉన్న ఇందన ధరలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి.

48 రోజుల తర్వాత పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు..ఇక వాయింపేనా !
Follow us

|

Updated on: Nov 20, 2020 | 11:19 AM

పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పైకి ఎగబాకాయి. గత 48 రోజులపాటు నిలకడగా ఉన్న ఇందన ధరలకు ఇప్పుడు రెక్కలొచ్చాయి. ప్రభుత్వ రంగ చమురు దిగ్గజాలు లేటెస్ట్‌గా రేట్లను పెంచాయి. దీంతో న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్‌ ధర 17 పైసలు పెరిగి 81.23ను చేరింది. డీజిల్‌ ధరలు సైతం లీటర్‌కు 22 పైసలు పెరిగి 70.68ను తాకింది. అయితే వ్యాట్ సహా ఇతర కారణాల వల్ల రాష్ట్రాల వారీగా డీజిల్, పెట్రోల్ ధరల్లో వ్యత్యాసం ఉంది.‌

ప్రధాన నగరాలలో ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ ధరలు ఇలా ఉన్నాయి :

ముంబై : ముంబైలో పెట్రోల్‌ లీటర్‌ రూ. 87.92ను తాకింది.. డీజిల్‌ రూ. 77.11కు చేరింది

చెన్నై : చెన్నైలో పెట్రోల్‌ ధర రూ. 84.31చేరగా.. డీజిల్ రూ. 76.17గా ఉంది.

కోల్‌కతా:  కోల్‌కతాలో పెట్రోల్‌ ధర రూ. 82.79ను తాకింది.. డీజిల్‌ రూ. 74.24గా ఉంది.

హైదరాబాద్ : 

ప్రస్తుతం హైదరాబాద్‌లో లీటర్‌ పెట్రోల్‌ 22 పైసలు పెరిగి రూ. 85.47కు చేరింది

డీజిల్‌ ధరలు మరింత అధికంగా 28 పైసలు బలపడి రూ. 77.12ను తాకినట్లు తెలుస్తోంది.

విదేశీ మార్కెట్లో ముడిచమురు రేట్లు  ఆధారంగా దేశీయంగా  ఆయిల్‌ మార్కెటింగ్ కంపెనీలు పెట్రో ఉత్పత్తుల ధరల్లో హెచ్చుతగ్గులు చేస్తుంటాయి.   ప్రస్తుతం లండన్‌ మార్కెట్లో బ్రెంట్‌ చమురు బ్యారల్‌ 0.25 శాతం ఎగసి 44.30 డాలర్ల వద్ద కదులుతోంది. ఇక న్యూయార్క్‌ మార్కెట్లో నైమెక్స్‌ బ్యారల్‌ 41.74 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.

Also Read : 

వారెవ్వా.. అతడికి అదృష్టం ఆకాశం నుంచి ఊడిపడింది..ఒక్క రోజులో కోటీశ్వరుడు

పెంపుడు శునకంపై మితిమీరిన ప్రేమ..యువతి ఆత్మహత్య..అక్కడే పూడ్చిపెట్టాలంటూ..