గుడ్‌ న్యూస్: దిగొస్తోన్న పెట్రోల్, డీజిల్ ధరలు

అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్‌లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.78.25గా ఉంది. అలాగే.. డీజిల్ ధర లీటర్ రూ. 72.85గా ఉంది. అలాగే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.21 కాగా.. డీజిల్ రూ.75లుగా ఉంది. సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 14 పైసలు, డీజిల్ లీటర్‌పై […]

  • Tv9 Telugu
  • Publish Date - 4:30 pm, Tue, 8 October 19

అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్‌లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. కాగా.. ప్రస్తుతం ఈరోజు హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రూ.78.25గా ఉంది. అలాగే.. డీజిల్ ధర లీటర్ రూ. 72.85గా ఉంది. అలాగే ఏపీలో లీటర్ పెట్రోల్ ధర రూ.77.21 కాగా.. డీజిల్ రూ.75లుగా ఉంది.

సోమవారం పెట్రోల్ ధర లీటర్‌పై 14 పైసలు, డీజిల్ లీటర్‌పై 13 పైసలు దిగొచ్చింది. దీంతో.. హైదరాబాద్‌లో సోమవారం రూ.78.43కు తగ్గింది. అలాగే డీజిల్ ధర రూ.72.96కి క్షీణించింది. అలాగే మంగళవారం.. పెట్రోల్ ధర లీటర్‌పై 18 పైసలు, డీజిల్ ధర లీటర్‌పై 11 పైసలు తగ్గింది. ‘అరాంకో’ చమురు కర్మాగారంపై జరిగిన డ్రోన్ దాడి అంతర్జాతీయంగా మార్కెట్‌ను కుదిపేసింది. దీంతో దేశంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరగుతూనే ఉన్నాయి. ఆ తరువాత ఇలా పెట్రోల్ ధరలు తగ్గడం వరుసగా ఇది ఆరో రోజు కావడం గమనార్హం.