దిగొస్తున్న పెట్రోల్ ధరలు

Petrol and Diesel rates are decreasing in Hyderabad, దిగొస్తున్న పెట్రోల్ ధరలు

అంతర్జాతీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వస్తున్నాయి. రెండు నెలలక్రితం ఒక రేంజ్‌లో 80 రూపాయల గీటు దాటిన పెట్రోల్, డీజిల్ ధరలు.. ఇప్పుడు కాస్త దిగి వచ్చాయి. ప్రస్తుతం మార్కెట్లో.. లీటర్ పెట్రోల్ ధర రూ.76లుగా ఉంది. అలాగే.. డీజిల్ ధర ఈ రోజు రూ.71లుగా ఉంది. కేంద్ర బడ్జెట్ తర్వాత.. చమురు ధరలు, కూరగాయల ధరలు తగ్గుతూ వస్తున్నాయి. కానీ.. పడిసి ధరలు మాత్రం పరుగులు పెడుతోన్నాయి.

రోజు రోజుకీ.. పెట్రోల్ ధర.. పైసల రూపంలో.. తగ్గుతూ.. ఇప్పటివరకూ.. దాదాపు 10 రూపాయలు తగ్గినట్టు మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. డాలర్‌తో రూపాయి మారకం కాస్త బలపడటంతో.. చమురు ధరలు తగ్గు ముఖం పడుతోన్నాయి. ఇదే రోజు ఢిల్లీలో లీటర్ పెట్రోలు ధర రూ.71.95గా డీజిల్ రూ.65లుగా ఉంది. ఇక దేశ రాజధాని ముంబాయిలో అత్యధికంగా లీటర్ పెట్రోల్ ధర రూ.77.62లు కాగా.. డీజిల్ 68 రూపాయలుగా ఉంది.

గత సంవత్సరంలో ఇదే సమయానికి హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర రికార్డు స్థాయిలో రూ.87కు చేరగా.. ముంబాయిలో రూ.91కి చేరింది. అప్పుడు.. పెట్రోల్ కోసం వాహనదారులు యుద్ధాలే చేశారు. కాగా.. 2019 జులై నెల వరకూ.. లీటర్ పెట్రోల్ ధర రూ.78గా ఉండేది. ఈ మధ్య హెచ్చుతగ్గులకు గురవుతూ..పెట్రోల్ ధరలు తగ్గుతూ.. పెరుగతూ వస్తోన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. వినియోగదారుడికి స్వల్ప ఊరట లభించినట్టే.

Petrol and Diesel rates are decreasing in Hyderabad, దిగొస్తున్న పెట్రోల్ ధరలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *