రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బాదుడు స్టార్ట్..

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం తాజాగా 60 పైసలు చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఆదివారం పెంచిన రేటుతో కలిపి.. రెండు రోజుల్లో మొత్తం రూ.1.20 పైసలు పెరిగింది. దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు...

రెండో రోజు పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు.. బాదుడు స్టార్ట్..
Follow us

| Edited By:

Updated on: Jun 08, 2020 | 1:13 PM

దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు మళ్లీ పెరిగాయి. సోమవారం తాజాగా 60 పైసలు చొప్పున పెంచినట్లు చమురు సంస్థలు తెలిపాయి. ఆదివారం పెంచిన రేటుతో కలిపి.. రెండు రోజుల్లో మొత్తం రూ.1.20 పైసలు పెరిగింది. దాదాపు 80 రోజుల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి. తాజాగా లీటర్ పెట్రోల్ ధర రూ.71.86 నుంచి రూ.72.46 అవ్వగా.. డీజిల్ ధర లీటర్ రూ.69.99 నుంచి.. ఈ రోజు రూ.70.59గా ఉంది. చివరిసారిగా మార్చి 16న దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలను సవరించాయి ఆయిల్ కంపెనీలు. ఆ తర్వాత మళ్లీ చమురు ధరలు పెరగలేదు. ఇప్పుడు లాక్‌డౌన్ నుంచి మినహాయింపులు ఇస్తున్న నేపథ్యంలో ఆయిల్‌ ధరలకు డిమాండ్ పెరిగింది.

ప్రముఖ నగరాల్లో పెట్రోల్-డీజిల్ ధరలు:

– హైదరాబాద్‌లో పెట్రోల్‌ లీటర్ రూ.75.22, డీజిల్ రూ.69 – అమరావతిలో పెట్రోల్ లీటర్ రూ.75.82, డీజిల్ రూ.69.65 – న్యూఢిల్లీలో పెట్రోల్ లీటర్ రూ.72.46, డీజిల్ రూ.70 – చెన్నైలో పెట్రోల్ లీటర్ 76.60, డీజిల్ రూ.69.25 – ముంబైలో పెట్రోల్ లీటర్ రూ.79.49, డీజిల్ రూ.69.37

Read More:

బ్రేకింగ్: ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌కు అస్వస్థత.. రేపే కరోనా పరీక్షలు

మహిళల కోసం కేంద్రం మరో స్కీమ్.. తక్షణమే రూ.10 లక్షల రుణం..