రాహుల్‌ గాంధీ మనవాడే: సుప్రీంకోర్టు

Rahul Gandhi's citizenship, రాహుల్‌ గాంధీ మనవాడే: సుప్రీంకోర్టు

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి సుప్రీంకోర్టులో ఊరట లభించింది. ద్వంద్వ పౌరసత్వం కలిగిన ఆయనను.. ఎన్నికల్లో పోటీకి అనర్హుడిగా ప్రకటించాలని దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఓ కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్ ఆధారంగా ఆయన పౌరసత్వంపై కోర్టును ఎలా ఆశ్రయిస్తారని పిటిషనర్‌ను ప్రశ్నించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్.. ఆ పిటిషన్‌ను కొట్టివేశారు.

అయితే బ్రిటన్‌కు చెందిన ఓ కంపెనీలో రాహుల్ డైరక్టర్, కార్యదర్శి హోదాలో ఉన్నారని హిందూ మహాసభ సభ్యుడు జై భగవాన్ గోయల్ సుప్రీంను ఆశ్రయించారు. 2005-06 ఆర్థిక సంవత్సరానికి గానూ కంపెనీ వార్షిక ఐటీ రిటర్న్స్‌లో పౌరసత్వం అని ఉన్న చోట రాహుల్ బ్రిటీషనర్ అని పేర్కొన్నారని అందులో వెల్లడించారు. ఎన్నికల నిబంధనల ప్రకారం విదేశీ పౌరసత్వం ఉన్నవారు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులన్న విషయాన్ని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. బీజేపీ రాజ్యసభ ఎంపీ సుబ్రమణ్య స్వామి కూడా ఇదే విషయమై ఇటీవల కేంద్రానికి లేఖ రాశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *