మానవాళి మనుగడకే ముప్పుగా పురుగు మందుల వాడకం

పంటకు పురుగు ఆశించింది. క్రిమి సంహారక మందు వాడతాం. వాటిని వదిలించుకునే వరకు వాడుతూనే ఉంటాం. అవసరమైన మోతాదులో వాడితే ఇబ్బంది లేదు. అంతకు మించితే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఐక్య రాజ్యసమితిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే విషయం చెబుతోంది. పురుగు మందులు, క్రిమి సంహారకాలు విచ్చలవిడిగా వాడటం వల్ల మానవుడి ఉనికే ప్రమాదంలో పడబోతుందని హెచ్చరిస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనసరిని సూచించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం […]

మానవాళి మనుగడకే ముప్పుగా పురుగు మందుల వాడకం
Follow us

|

Updated on: Jan 10, 2020 | 7:17 PM

పంటకు పురుగు ఆశించింది. క్రిమి సంహారక మందు వాడతాం. వాటిని వదిలించుకునే వరకు వాడుతూనే ఉంటాం. అవసరమైన మోతాదులో వాడితే ఇబ్బంది లేదు. అంతకు మించితే మానవాళి మనుగడకే ముప్పు వాటిల్లుతోంది. ఐక్య రాజ్యసమితిలోని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదే విషయం చెబుతోంది. పురుగు మందులు, క్రిమి సంహారకాలు విచ్చలవిడిగా వాడటం వల్ల మానవుడి ఉనికే ప్రమాదంలో పడబోతుందని హెచ్చరిస్తోంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తప్పనసరిని సూచించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

పెరుగుతున్న జనాభాకు ఆహారాన్ని అందించడం తప్పనిసరి. అందుకు పంటలు తప్ప మరో మార్గం లేదు. పంట దిగుబడులు వచ్చే సమయంలో చీడపీడలు, పురుగులు, తెగుళ్లు సోకడం చాలా మాములుగానే జరుగుతోంది. వాటి నివారణకు పురుగు మందుల వినియోగం చేస్తున్నాడు మానవుడు. తప్పనిసరిగా పురుగు మందుల వాడకం చేయాలనే వైఖరిని తప్పు పట్టారు ఐక్యరాజ్య సమితి ఆహార, కాలుష్య నిపుణులు. ఈ మేరకు ఐక్య రాజ్య సమితికి చెందిన మానవ హక్కుల మండలికి ఒక నివేదిక ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పురుగుల మందుల తయారీ సంస్థల తీరును తప్పుపట్టారు వాళ్లు. పురుగు మందుల రసాయనాల వల్ల తలెత్తే హాని గురించి ఆ సంస్థలు వాస్తవాలను పక్కన పెడుతున్నట్లు గుర్తించాయి. అనైతిక మార్కెటింగ్‌ వ్యూహాలు, ప్రభుత్వాల వద్ద భారీ పైరవీల ద్వారా ముప్పును వెలుగులోకి రానివ్వడంలేదని ఆ నివేదికలో పొందుపరచడం చర్చనీయాంశమైంది.

ప్రస్తుత ప్రపంచ జనాభా 700 కోట్లు. ఇందులో 270 కోట్ల మంది చైనా, భారత్ లోనే ఉన్నారు. 2050 నాటికి ప్రపంచ జనాభా 900 కోట్లకు చేరుతుందని అంచనా. వారి ఆహార అవసరాలు తీర్చడానికి పంటలను వేయాలి. వాటికి ఆశించిన చీడ, పీడల నివారణకు పురుగు మందుల వాడకం తప్పనిసరి. అది ఇప్పుడు ఏటా 5వేల కోట్ల డాలర్లకు చేరింది. ఒక్క భారత్ లోనే ఏటా 4,050 మెట్రిక్ టన్నుల పురుగు మందుల వాడకం జరుగుతోంది. ఈ మధ్య కాస్త అది తగ్గినా వాడకం ఆపలేదు. మందులు పంటల పరిరక్షణలోను, ఆహారోత్పత్తిని పెంచడంలోను కీలక పాత్ర పోషిస్తాయని పురుగు మందుల కంపెనీలు వాదిస్తున్నాయి. వాస్తవంగా అవి కొంత వరకే ప్రభావం కలిగిస్తాయి.

విచ్చల విడిగా క్రిమిసంహారక మందుల వినియోగం వల్ల పర్యావరణం, మానవ ఆరోగ్యం, మొత్తం సమాజం పైనా తీవ్ర ప్రభావం పడుతోంది. వీటిలోని తీవ్రస్థాయి విషపదార్థాల వల్ల ఏటా రెండు లక్షల మంది చనిపోతున్నారు. అంతే కాదు..దీర్ఘకాలం పాటు ఈ రసాయనాలకు గురికావడం వల్ల క్యాన్సర్‌, అల్జీమర్స్‌, పార్కిన్‌సన్స్‌ వంటి వ్యాధులు వస్తున్నాయి. హార్మోన్లలో అవరోధాలు, ఎదుగుదలకు సంబంధించిన రుగ్మతలు, వంధ్యత్వం వంటివి ఉత్పన్నమయ్యే ప్రమాదం ఉంటోంది. క్రిమి సంహారకాలతో ఆహారం కలుషితం కావడం వల్ల చిన్నారులపైనా పెనుప్రభావం పడుతోంది. 2013లో దీనివల్ల భారత్‌లో 23 మరణాలు, 2015-19 వరకు 243 మంది మృత్యు వాతపడ్డారు. రైతులే ఇందుకు బాధ్యులని పరిశ్రమల ఆరోపణ. ఈ రసాయనాలను ఉద్దేశపూర్వకంగా దుర్వినియోగం చేస్తున్నారని వేలెత్తి చూపుతున్నాయి. ఇది నిజం కాదు. ఈ మందుల బారి నుంచి రైతులను, ఇతరులను రక్షించాలంటే పురుగు మందుల కంపెనీలను నియంత్రించాలి. క్రిమిసంహారక మందులవల్ల ప్రతికూలప్రభావం ఉంటుందని శాస్త్ర పరిశోధనల్లో తేలింది. వాటి వల్ల మానవ ఆరోగ్యానికి, పర్యావరణానికి హాని కలుగుతుందని ప్రచారం చేయాలి. వర్ధమాన దేశాల్లో 35 శాతం మాత్రమే క్రిమిసంహారక మందులపై నియంత్రణ వ్యవస్థలు ఉన్నాయి. వాటి అమలు సమస్యాత్మకంగానే ఉంది. ఒక దేశంలో వినియోగాన్ని నిషేధించిన రసాయనాలను మరో దేశం వాడుతోంది. అదే సమయంలో తమ దేశంలో వాడక పోయినా మిగతా దేశాలకు ఎగుమతి చేస్తు డబ్బులు సంపాదిస్తున్నాయి.

ప్రపంచ ఆరోగ్య సంస్థ లెక్కల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 280 గ్రాముల కూరగాయల ఆహారంగా తీసుకోవాలి. ప్రస్తుతం 120 గ్రాముల నుంచి 140 గ్రాముల వరకు తీసుకుంటున్నాం. వాటిలోను క్రిమిసంహారక అవశేషాలు ఉంటున్నాయి. సురక్షిత, ఆరోగ్యకర ఆహార, వ్యవసాయ ఉత్పాదకత దిశగా అంతర్జాతీయ విధానాలు అవసరం. క్రిమిసంహారక మందుల వినియోగంపై అంతర్జాతీయ ఒప్పందాన్ని సిద్ధం చేయాలి. కీటకాలను ప్రకృతిసిద్ధమైన పద్ధతుల్లో అణచివేయడం, పంటల మార్పిడి, సేంద్రియ పద్ధతుల్లో ఆహారోత్పత్తికి రాయితీలివ్వడం వంటివి చేయాలి.

ఎక్కువ వినియోగం వల్ల ఏమవుతోంది..

పంట ఉత్పత్తుల రక్షణ కోసం, దిగుబడిని పెంచుకునేందుకు రైతులు విచక్షణ రహితంగా పురుగు మందులను వినియోగిస్తున్నారు. పరిమితికి మించి పురుగు మందుల అవశేషాలు వాడటం ఇబ్బందికలిగించే అంశం. ఫలితంగా భయంకరమైన వ్యాధులు వచ్చే వీలుంది. సేంద్రియ సాగు విధానం సక్రమంగా అమలు అయితే ఈ ఇబ్బంది తక్కువగా ఉంటోంది. పత్తి, మిర్చితో పాటు.. కూరగాయల తెగుళ్ల నివారణకు మందుల వాడకం ఎక్కువగా ఉంటోంది. మందులు పిచికారీ చేసిన కూరగాయలను కొనడం వల్ల సరికొత్త ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. వాటిని సరిగా కడకపోవడం, ఉప్పు నీటితో శుభ్రం చేయకపోవడం ఇబ్బంది కలిగించే అంశమే. మందుల వాడకం ఎక్కువైతే సారవంతమైన పంట భూములు నిస్సారంగా మారతాయ. మరి కొన్నాళ్లు ఇలాగే పు రుగు మందులు, ఎరువులు వాడితే నేల సహజ స్వభావం కోల్పోతుంది. పంటల దిగుబడులపైనా ప్రభావం పడుతోంది. మోతాదుకు మించి వాడుతున్న మందుల అవశేషాలు పంట ఉత్పత్తులో మిలితమై ఉంటున్నాయి. రైతులకు అవగాహన లేక కొంత, పంట ఉత్ప త్తులు పెరగాలనే ఆశ మరికొం వాటి వినియోగం పెరిగేందుకు కారణమవుతోంది.

వాతావరణంలో వచ్చే మార్పులు, ప్రత్యేక పరిస్థితులతో పంటలు దెబ్బతింటాయి. పంటకు ఏమైందని విషయం పై రైతులకు అవగాహన ఉండటం లేదు. క్షేత్ర స్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు అందుబాటులో లేకపోవడం రైతులకు శాపంగా మారింది. రైతులే స్వయంగా పురుగుల మందు డీలర్ల వద్దకు వెళుతున్నారు. తమకు తోచిన రీతిలో పంట పరిస్థితిని వివరిస్తున్నారు. వారిచ్చిన మందులనే తెచ్చి వాడుకునే దుస్థితి ఇప్పటికి ఉంది. ప్రతి రెండు వేల హెక్టార్లకు ఒక విస్తరణ అధికారి చొప్పున నియామకాలు జరిగితే ఇబ్బందులు తప్పుతాయి. పంటలకు సోకే తెగుళ్లు, రోగాల నిర్దారణ, వీటిపై రైతులకు సలహాలు సూచనలు ఎప్పటికప్పుడు అందాలి. భూసార పరీక్షలపై అవగాహన కల్పించాలి.

రోగం తెలియకుండా మందు వాడితే… చాలామంది రైతులకు రోగం తెలియదు. పంటకు ఏం రోగం వచ్చింది. ఏ మందు వాడోలో అవగాహన లేకపోవడం వలన వారు చెప్పింది ఒకటి. వీరు చెప్పింది మరొకటి.ఇలా మోతాదుకు మించి మందులను వాడటం వల్ల పెట్టుబడి పెరుగుతుంది. అదే సమయంలో పర్యావరణ సమతౌల్యత దెబ్బతింటోంది. అందుకే వ్యవసాయధికారులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండాలి. ముందుగా ఖాళీలను పూరించాలి. ఏం మందులు వాడాలో, ఎంత మోతాదులో వాడాలో సిఫారసు చేస్తేనే మంచిది. బీఎస్సీ అగ్రిక ల్చర్ చదివిన ఏఈవోలు స్వయంగా మందులు రాయవచ్చు. డిప్లొమా చేసిన ఏఈఓలు మండల వ్యవసాయ అధికారుల దృష్టికి తేవాలి. డిప్లొమా చేసి అనుభవం ఉన్న ఏఈవోలకు మందులు సిఫారసు చేసే అవకాశం కల్పించింది తెలంగాణ ప్రభుత్వం. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మందుల వినియోగం పై ఎప్పటికప్పుడు సభలు, సమావేశాలు నిర్వహిస్తూ అవగాహన కల్పించే పని చేస్తోంది.

వ్యవసాయ అధికారుల సిఫారసు లేనిదే మందులు విక్రయించరాదని దుకాణాల డీలర్లకు నోటీసులు ఇవ్వాలి. వచ్చే ఖరీఫ్ నుంచే అమలు చేయాలని తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలు భావిస్తున్నాయి. అదే సమయంలో మార్కెట్‌లోకి వచ్చే కొత్త రకం పురుగుల మందులపైనా అధికారులు అవగాహన పెంచుకోవాలి. పురుగులు వెంటనే చస్తాయని రైతులు కొత్త రకం మందుల వాడకం వైపు ఎక్కువ మొ గ్గు చూపే వీలుంది. అందుకే ఇక్కడ అధికారులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. పురుగు మందుల విచ్చలవిడి వాడకాన్ని తగ్గించేందుకు భూసార పరీక్షలే కీలకం. రసాయనిక పురుగు మందులను పూర్తిగా మానేసేలా చర్యలు ఉండాలి. పురుగు దశలను అర్ధం చేసుకొని మందులు వాడాలి. ఏ దశలో ఎలాంటి చర్యలు చేపట్టాలి. పురుగులు సమస్యగా మారకుండా కాపాడవచ్చో తెలుసుకోవాలి. పంటకు నష్టం కలుగ చేసే స్థాయిలోనే నివారణ చర్యలు చేపడితే మంచిది. ప్రకృతి లో వున్న సమతుల్యాన్ని కాపాడుకోవటం వలన పురుగు ఉధృతి ఎక్కువవుతోది. స్థానిక వనరులు ఉపయోగించి నివారణ చర్యలు చేపట్టటం, సహజ ప్రక్రియలను సమర్ధవంతంగా వినియోగంచుకోవటం మంచిది.

కొనుగోలులో జాగ్రత్తలు

పురుగు మందులు కొనుగోలు చేసేటప్పుడు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. లేకపోతే ఇబ్బంది తప్పదు. లైసెన్సు కలిగిన అధీకృత డీలర్‌ వద్దనే పురుగుమందులు కొనుగోలు చేయాలి. మందుల ప్యాకింగ్‌, డబ్బాలపై తయారీ తేది, గడువు పరిశీలించడం తప్పనిసరి. గడువు దాటిన మందులను ఎట్టి పరిస్థితిల్లో తీసుకోవద్దు. నిర్ణీత ప్యాకింగ్, సీల్‌ ఉన్న మందులనే కొనుగోలు చేయాలి. లీకేజీతో ఉన్న డబ్బాలను పరిశీలించాలి. కొనుగోలు చేసే ముందు దాని రశీదు, బిల్లు తప్పనిసరిగా తీసుకోవాలి. బిల్లులో మందు పేరు, కంపెనీ వివరాలు, బ్యాచ్‌ నంబర్‌, రైతు సంతకం ఉంటేనే మంచిది. ఒకవేళ రైతు నష్టపోతే పరిహారం పొందడానికి ఈ బిల్లు ఉపయోగపడుతుంది. మార్కెట్‌లోకి కొత్తగా వచ్చిన మందులను కొనేముందు వ్యవసాయ అధికారులను సంప్రదించడం మేలు. అలానే పిచికారీలోను జాగ్రత్తలు పాటించకపోతే ఇబ్బందులు తప్పవు. సమగ్ర సస్యరక్షణ పద్ధతులను పాటించి, సిఫార్సు చేసిన మందులను మాత్రమే పంటలకు పిచికారీ చేయాలి. అవసరాన్ని బట్టే మందులను ఉపయోగించాలి. తక్కువ కాలంలో విష ప్రభావం కోల్పోయే సస్యరక్షణ మందులు, బయోఫెస్టిసైడ్‌ మందులను మాత్రమే తీసుకోవాలి. వ్యవసాయ అధికారులు సూచించిన మోతాదులో, సరైన సమయంలో, సరైన స్ర్పేయర్‌ ఉపయోగించాలి. పంటలను కోసే ముందు సాధ్యమైనంత వరకు సస్యరక్షణ మందులను పిచికారీ చేయకపోతేనే మంచిది. పురుగు మందులను చల్లిన చోట పశువులను మేతకు తీసుకెళ్లరాదు. పురుగుమందు ఉపయోగించిన స్ప్రేయర్‌లను తాగు నీటి చెరువులు, కుంటల్లో శుభ్రం చేయరాదు. వాడేసిన ఖాళీ డబ్బాలు, పాత్రలను రాయి, కర్రతో చితగొట్టి నీటి వనరులకు దూరంగా భూమిలో లోతుగా పాతిపెట్టాలి. చాలా మంది అవి చేయడంలేదు. ఇంట్లో వివధ పనుల కోసం వాటిని వాడుతున్నారు. ఫలితంగా ఇబ్బందులు తలెత్తుతున్నాయి. ఖాళీ అయిన బుడ్లు, డబ్బాలను ఏ అవసరానికైనా సరే తిరిగి వాడకూడదని తెలియాలి. పురుగు మందులను అపమార్గంలో వినియోగించవద్దు. పురుగు మందులను చల్లిన తర్వాత పచ్చి ఆకులను ఆహారంగా వాడకూడదు.

ఎరువులనే కాకుండా మహారాష్ట్రలో ఇస్తున్నట్టుగా విత్తనాలు, పురుగు మందులను ప్రభుత్వం సబ్సిడీ రూపంలో ఇచ్చే ఆలోచన చేయాలి. ఫలితంగా ప్రైవేటు కంపెనీల బారిన పడకుండా అన్నదాతను కొద్దిగానైనా ఒడ్డున పడేసిన వారవుతారు. పకృతి సిద్దమైన పద్దతుల్లో పురుగులను చంపే ఆలోచన చేయాలి. పంటల మార్పిడి ఉండాలి. సేంద్రియ పద్దతుల్లో ఆహార ఉత్పత్తులు ఉండాలి. అప్పుడే కొంత వరకైనా ముప్పు తప్పుతోంది. వరుస కరువు, ప్రకృతి వైపరీత్యాలు, రుణ సమస్యలు, మార్కెటింగ్‌ సమస్యలు వంటివి రైతులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. ముందస్తుగానే వాటి పై పాలకులు చర్యలు తీసుకోవాలి. లేకపోతే పురుగు మందుల వాడకం పెరిగి..ప్రజల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందన్నది నిజం.

-కొండవీటి శివనాగరాజు సీనియర్ జర్నలిస్టు, టీవీ9

వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఆడు జీవితం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
నల్లగా ఉన్నాయని చీప్‌గా చూడకండి.. ఈ రైస్ గుండె జబ్బులున్నవారికి.!
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
కేసీఆర్ బస్సును ఆపి భావోద్వేగంతో మాట్లాడిని రైతన్నలు..
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
తొక్కే కదా అని తీసిపారేయకండి.. వీరికి ఇది బ్రహ్మాస్త్రం.!
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
'వరంగల్‎కి త్వరలో ఎయిర్ పోర్టు'.. జనజాతర సభలో సీఎం రేవంత్..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
జాక్ పాట్ కొట్టిన ప్రశాంత్ వర్మ..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..
ప్రపంచ మలేరియా దినోత్సవాన్ని ఎందుకు జరుపుకుంటారో తెలుసా..