కశ్మీర్ పై మరో ‘ గొంతు ‘ విషం కక్కింది.. అదేంటో.. ఆయన మాటల్లోనే.. !

భారత-పాకిస్తాన్ దేశాలమధ్య రేగిన కశ్మీర్ చిచ్ఛుకు ఆజ్యం పోస్తూ … పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా రంగంలోకి దిగాడు. కశ్మీర్ అంశం పాక్ రక్తం లోనే ఉందని అంటూ… తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన.. కార్గిల్ యుధ్ధం గురించి ప్రస్తావించాడు. తమ దేశం సదా శాంతి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ.. భారత్ అదే పనిగా తమను బెదిరిస్తూ వస్తోందని ఆయన ఆరోపించాడు. ఆల్ పాకిస్తాన్ […]

కశ్మీర్ పై మరో  ' గొంతు ' విషం కక్కింది.. అదేంటో.. ఆయన మాటల్లోనే.. !
Follow us

|

Updated on: Oct 08, 2019 | 11:18 AM

భారత-పాకిస్తాన్ దేశాలమధ్య రేగిన కశ్మీర్ చిచ్ఛుకు ఆజ్యం పోస్తూ … పాకిస్తాన్ మాజీ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ కూడా రంగంలోకి దిగాడు. కశ్మీర్ అంశం పాక్ రక్తం లోనే ఉందని అంటూ… తిరిగి తాను క్రియాశీల రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్టు చెప్పకనే చెప్పాడు. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్న ఆయన.. కార్గిల్ యుధ్ధం గురించి ప్రస్తావించాడు. తమ దేశం సదా శాంతి మంత్రాన్ని జపిస్తున్నప్పటికీ.. భారత్ అదే పనిగా తమను బెదిరిస్తూ వస్తోందని ఆయన ఆరోపించాడు. ఆల్ పాకిస్తాన్ ముస్లిం లీగ్ (ఏపీఎంఎల్) చైర్మన్ అయిన 76 ఏళ్ళ ముషారఫ్… తమ పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా సోమవారం ఇస్లామాబాద్ లోని పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి దుబాయ్ నుంచి ఫోన్ ద్వారా మాట్లాడాడు. తన ఆరోగ్యం క్షీణిస్తున్న దృష్ట్యా ఆయన గత ఏడాది రాజకీయాలకు కాస్త బ్రేక్ ఇచ్చ్చాడు. జమ్మూ కశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తిని కల్పించేందుకు వీలు కల్పిస్తున్న ఆర్టికల్ 370 ని మోదీ ప్రభుత్వం రద్దు చేసిన అనంతరం ముషారఫ్ పబ్లిక్ గా చేసిన తొలి కామెంట్ ఇది !

ఎట్టి పరిస్థితుల్లోనూ తాము కాశ్మీరీ సోదరులకు అండగా ఉంటామని చెప్పిన ఆయన.. పాకిస్తాన్ శాంతిని కోరుతున్నదంటే దాన్ని బలహీనతగా భావించరాదని అన్నారు. 2016 మార్చి నుంచీ దుబాయ్ లోనే ఉంటున్న ముషారఫ్.. 2007 లో దుబాయ్ విమానం ఎక్కక తప్పలేదు. రాజ్యాంగాన్ని సస్పెండ్ చేసినందుకు ఆయనపై అప్పటి ప్రభుత్వం రాజద్రోహం కేసు మోపింది. ప్రస్తుతం ముషారఫ్ ఆరోగ్యం మెరుగుపడుతోందని పాకిస్తానీ మీడియా తెలిపింది. తన శరీరంలోని కణజాలంలో ‘ ఎమిలాయిడ్ ‘ అనే అసాధారణ ప్రోటీన్ కారణంగా తలెత్తిన అరుదైన రుగ్మతల వల్ల ముషారఫ్ దాదాపు ‘ మంచం పట్టాడు ‘.అయితే దుబాయిలో లభిస్తున్న వైద్య చికిత్సతో మెలమెల్లగా కోలుకుంటున్నాడు. 1998 నుంచి సుమారు పదేళ్ల పాటు పాక్ అధ్యక్షునిగా వ్యవహరించిన ఈయన.. దివంగత మాజీ ప్రధాని బెనజీర్ భుట్టో హత్య కేసులో నేరస్థుడన్న ఆరోపణను ఎదుర్కొంటున్నాడు.

ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఛేదనలో చేతులెత్తేసిన ఢిల్లీ.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్‌దే గెలుపు
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
ఫోర్త్ అంపైర్‌తో గొడవపడిన పాంటింగ్-గంగూలీ.. కట్‌చేస్తే..
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
శివసేనలో చేరిన నటుడు గోవిందా.. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ!
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
విదేశాల్లో మరో విషాదం.. తెలంగాణ సాఫ్ట్ వేర్ ఇంజనీర్ మృతి
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
84 రన్స్ తో రఫ్ఫాడించిన రియాన్ పరాగ్‌.. ఢిల్లీ టార్గెట్ ఎంతంటే?
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
నా తమ్ముడిని బామర్ధి అంటూ.. వాడికి మెసేజ్‌లు చేస్తున్నారు..
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
సమ్మర్ కు వెకేషన్ కు చిరంజీవి రెడీ.. భార్య సురేఖతో కలిసి మరోసారి
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
ముంబైకు భారీ షాక్..రాబోయే మ్యాచ్‌లకు ఆ స్టార్ ప్లేయర్ దూరం
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
బీఆర్ఎస్ కు మరో షాక్.. కూతురితో సహా కేకే కాంగ్రెస్ లోకి!
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..
వాట్సాప్‌ యూజర్లకు పండగే.. ఫొటో ఎడిటింగ్‌ కోసం..