ఒక్కరి కోసం తెరుచుకున్న ‘మచు పిచు’

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడం మచు పిచు.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ పర్యాటక ప్రాంతానికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు.

ఒక్కరి కోసం తెరుచుకున్న 'మచు పిచు'
Follow us

|

Updated on: Oct 14, 2020 | 1:55 PM

పెరూ దేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడం మచు పిచు.. ఎంత ఫేమసో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.  ప్రపంచవ్యాప్తంగా ఎంతో ప్రసిద్ది చెందిన ఈ పర్యాటక ప్రాంతానికి నిత్యం వేలాది మంది సందర్శకులు వస్తూ ఉంటారు. కాగా కరోనా కారణంగా లాక్‌డౌన్‌ విధించడంతో గత కొన్ని నెలలుగా ఈ ప్రదేశం మూతబడింది. అయితే తాజాగా ఈ కట్టడాన్ని కొంతసేపు తెరిచారు. అది కూడా కేవలం ఒకే ఒక్క టూరిస్ట్ కోసం. జపాన్‌కు చెందిన 26ఏళ్ల జెస్సీ కటయమా ఈ ఏడాది మార్చిలో మచు పిచు సందర్శించేందుకు పెరూ వెళ్లారు. అదే సమయంలో కోవిడ్ వ్యాప్తి ప్రమాదకరంగా ఉండటంతో, పెరూ దేశం హెల్త్ ఎమర్జెన్సీ స్థితిని ప్రకటించింది. అంతర్జాతీయ విమాన సర్వీసుల రద్దు చేసింది. పర్యాటక ప్రాంతాలు, రద్దీ ప్రదేశాలను వెంటనే మూసివేసింది. దీంతో కటయమా గత మార్చి నుంచి పెరూలోనే చిక్కుకుపోయారు.

కటయమా గురించి ఇటీవల స్థానిక పర్యాటక అధికారులకు తెలిసింది. దీంతో అతడు మచు పిచు చూసేందుకు అధికారులు స్పెషల్ పర్మిషన్ ఇచ్చారు. కేవలం అతడి కోసమే ఆ కట్టడాన్ని కాసేపు తెరిచి ఉంచారు. టూరిస్టు పర్యటన పూర్తయిన తర్వాత మళ్లీ మూసేశారు. ఈ సందర్భంగా జెస్సీ కటయమా ఆనందంతో ఉప్పొంగిపోయారు. ‘మచు పిచు చూస్తానని అనుకోలేదు. కానీ అధికారుల సాయంతో ఈ చాన్స్ దక్కింది. పెరూ ప్రభుత్వం, అధికారులకు ప్రత్యేక ధన్యవాదాలు’ అని కటయమా తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్‌ చేశారు. అక్కడ తీసుకున్న ఫొటోలను కూడా పోస్ట్ చేశారు. కాగా మచుపిచును నవంబరులో తిరిగి తెరవనున్నారట. కరోనా వ్యాప్తికి ముందు ఈ కట్టడాన్ని రోజుకు 2వేల మందికి పైనే సందర్శించుకునేవారు. కానీ ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రోజుకు కేవలం 675 మంది టూరిస్టులను మాత్రమే అనుమతిస్తామని పర్యాటక శాఖ అధికారులు తెలిపారు. ( కీసర మాజీ తహశీల్దార్ నాగరాజు ఆత్మహత్య ! )

మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
బంగారం ప్రియులకు కాస్త ఊరట.. ఈరోజు గోల్డ్ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
పదో తరగతి అర్హతతో తపాలా శాఖలో భారీగా కొలువులు
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!