Breaking News
  • ఈ ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన పోలేదు. వర్షాలతో ఇసుక కొరత ఏర్పడింది. అప్పుడే దీక్షలు ఎందుకు. ఏ ప్రభుత్వానికైనా కొంత సమయం ఇవ్వాలి. చంద్రబాబు ప్రతిపక్ష నేత పాత్ర కూడా పోషించలేకపోతున్నారు-వంశీ
  • తిరుమల: ఈ నెల 23 నుంచి డిసెంబర్‌ 2 వరకు తిరుచానూరు పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలు. ఈ నెల 23న చిన్నశేష వాహనం, 27న గజవాహనం. 28న గరుడ వాహనం, డిసెంబర్‌ 1న పంచమి తీర్థం. డిసెంబర్‌ 2న పుష్పయాగ కార్యక్రమం-టీటీడీ.
  • రాఫెల్‌పై రాహుల్‌ గాంధీ ఆరోపణలు అవాస్తవమని.సుప్రీం తీర్పుతో తేటతెల్లమైంది-బీజేపీ రాష్ట్రఅధ్యక్షుడు లక్ష్మణ్‌. మోదీ ప్రభుత్వానికి క్లీన్‌ చిట్‌ ఇచ్చింది. జఠిల సమస్యలను సామరస్య పూర్వకంగా మోదీ పరిష్కరించారు. తెలంగాణలో అశాంతి, అసంతృప్తి నెలకొంది. అధికార పార్టీలో చాలా మంది అసంతృప్తితో ఉన్నారు. తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ బీజేపీనే. అందుకే అందరూ బీజేపీలో చేరుతున్నారు-లక్ష్మణ్‌
  • ముగిసిన ఆర్టీసీ, పొలిటికల్‌ జేఏసీ సమావేశం.
  • ఇసుక కొరతపై 12 గంటల పాటు దీక్ష చేసిన చంద్రబాబు రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తున్నారు. రాష్ట్రంలో జె-ట్యాక్స్‌ వసూలు చేస్తున్నారు. ముఖ్యమంత్రి నీరో చక్రవర్తిలా వ్యవహరిస్తున్నారు బాధితులకు అండగా నిలిస్తే దాడులు చేస్తున్నారు. ఇసుక లేక అన్ని వర్గాలు ఇబ్బందులు పడుతున్నాయి. నాపై కోపంతో అన్న క్యాంటీన్లు మూసేశారు-చంద్రబాబు
  • తిరుమల: సామాన్య భక్తునిగా శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్నినాని. సుపథం మార్గంలో వెళ్లి శ్రీవారిని దర్శించుకున్న మంత్రి పేర్ని నాని
  • ఇసుక కొరత వల్ల ప్రత్యక్షంగా, పరోక్షంగా లక్షల మంది నష్టపోయారు. చంద్రబాబు మీద కక్షతోనే భవన నిర్మాణ కార్మికుల పొట్టగొట్టారు. వైసీపీ ప్రభుత్వం జాతీయ పతాకాన్ని అవహేళన చేసింది.సచివాలయాలకు వైసీపీ రంగులేసే జగన్‌కు గాంధీ గురించి మాట్లాడే అర్హత లేదు-ఎంపీ రామ్మోహన్‌నాయుడు

రెచ్చి పోయిన సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డ్.. ఏం చేశాడంటే … ?

బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మాజీ బాడీగార్డు అనాజ్ ఖురేషీ రెచ్చి పోయాడు. యూపీలోని మొరాదాబాద్ లో బీభత్సం సృష్టించాడు. వీధుల్లో నానా హంగామా చేసిన అతడ్ని పట్టుకునేందుకు పోలీసులు… చేపలు పట్టే వలలు విసిరి, తాళ్లతో కట్టేసి నానా పాట్లూ పడ్డారు. చివరకు అతి కష్టం మీద పోలీసు స్టేషనుకు తరలించారు. గురువారం ఇతగాడు షర్టు విప్పేసి.. రోడ్డుపై పరుగులు తీస్తూ.. వాహనాలపై రాళ్లు విసురుతూ .. ఓ ఇనుప రాడ్ పట్టుకుని పలు కార్ల అద్దాలు ధ్వంసం చేశాడు. ఇతడి ‘ భయానక ‘ తీరు చూసి వాహనదారులు, పాదచారులు భయంతో హడలిపోయారు. ఈ బాడీ బిల్డర్ ను పట్టుకునేందుకు పోలీసులు, ఫైర్ బ్రిగేడ్ సిబ్బంది సహా వందలాది స్థానికులు పడిన అవస్థలు ఇన్నీఅన్నీ కావు. ఈ వీడియో వైరల్ అవుతోంది. స్టెరాయిడ్స్ అధిక మోతాదులో తీసుకోవడంవల్ల ఖురేషీ తన మానసిక స్థితి కోల్పోయాడని పోలీసులు తెలిపారు. మొరాదాబాద్ బాడీ బిల్డింగ్ టైటిల్ ని సాధించలేకపోయినందుకు ఖురేషీ తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడని, దాన్ని భరించలేక ఎక్కువగా స్టెరాయిడ్స్ తీసుకున్నాడని తెలిసింది. ఇతడిని మొదట పోలీసు స్టేషనుకు, ఆ తరువాత బేరైలీ మెంటల్ ఆసుపత్రికి తరలించారు.

ముంబైలో బౌన్సర్ గా పని చేసే ఖురేషీ రెండేళ్ల క్రితం సల్మాన్ బాడీగార్డుగా చేరాడు. ప్రస్తుతం మహారాష్ట్రలో ఓ మంత్రి సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్న ఇతడు.. రెండు రోజుల క్రితమే మిస్టర్ మొరాదాబాద్ ఛాంపియన్ షిప్ పోటీల్లో పాల్గొన్నాడు. ఫస్ట్ రన్నరప్ గా నిలిచినప్పటికీ.. బాడీ బిల్డింగ్ టైటిల్ సాధించలేకపోయాడు. దీంతో ఈ నెల 25 న జిమ్ కి వెళ్లేముందు స్టెరాయిడ్స్ ఎక్కువగా తీసుకున్నట్టు తెలిసింది. 2017 లో ఇతనిపై రేప్ కేసు నమోదయింది. పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు. అయితే ఆ తరువాత బెయిలుపై విడుదలయ్యాడు. తన మాజీ బాడీగార్డు ఇలా రెచ్చిపోయినట్టు తెలిసినప్పటికీ సల్మాన్ ఖాన్ స్పందించలేదు. అసలు జరిగిన విషయమేమిటో పూర్తిగా తెలుసుకున్నాకే దీనిపై మాట్లాడతానని తన సన్నిహితులతో వ్యాఖ్యానించినట్టు సమాచారం.