హ్యాష్‌టాగ్ నెంబర్ నైబర్.. మీ ముందు నంబరెవరిది?

వైరల్ ట్రెండ్స్‌కు, ఛాలెంజ్స్‌కు సోషల్ మీడియా నిలయమైంది. అలాగే తాజాగా ఓ నయా ట్రెండ్ నెట్టింట్లో మొదలైంది. నెటిజన్లు అందరూ తమ ఫోన్‌ నంబర్‌లోని చివరి అంకెని ఒకటి అటూ లేదా ఇటు మార్చి అవతలి వ్యక్తి ఎవరో తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు అది ట్విట్టర్‌లో వైరల్ అవుతోంది. ఈ కొత్త సవాల్‌లో వారు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. కొంతమందికి స్నేహపూర్వకంగా రిప్లైస్ వస్తే.. మరికొందరికి వ్యతిరేకంగా వచ్చాయి. ఇక నెటిజన్లు ఆ రిప్లైలను ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక ఈ ట్రెండ్‌కు మూలకారకుడు అమెరికాకు చెందిన ర్యాన్ అనే వ్యక్తి అని తెలుస్తోంది. లేట్ ఎందుకు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *