గాల్లో నుంచి ప‌డుతోన్న రాళ్లు..ఇదేం మిస్ట‌రీ…

తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మిడివరం మండలంలోని 4 గ్రామాల్లో ప్రజలు గత కొన్ని రోజులుగా చీకటి పడితే చాలు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇందుకు కార‌ణం ఉంది. రోజూ రాత్రి సమయంలో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు గ్రామాల్లోని ఇళ్ళ తలుపులు తట్టి, రాళ్లు విసిరేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఏం చేయాలో పాలుపోక పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి..గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతోన్న స‌మమంలోనే అజ్ఞాత వ్యక్తి రాళ్లతో దాడికి పాల్ప‌డి…అక్క‌డ్నుంచి పారిపోయాడు. పోలీసులు ఎంతగా ఆ […]

గాల్లో నుంచి ప‌డుతోన్న రాళ్లు..ఇదేం మిస్ట‌రీ...
Follow us

|

Updated on: May 22, 2020 | 12:31 PM

తూర్పు గోదావ‌రి జిల్లా ముమ్మిడివరం మండలంలోని 4 గ్రామాల్లో ప్రజలు గత కొన్ని రోజులుగా చీకటి పడితే చాలు భ‌యంతో వ‌ణికిపోతున్నారు. ఇందుకు కార‌ణం ఉంది. రోజూ రాత్రి సమయంలో ఎవ‌రో గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు గ్రామాల్లోని ఇళ్ళ తలుపులు తట్టి, రాళ్లు విసిరేస్తున్నారు. దీంతో ప్ర‌జ‌లు ఏం చేయాలో పాలుపోక పోలీసుల‌ను ఆశ్ర‌యించారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి..గాలింపు చ‌ర్య‌లు చేప‌డుతోన్న స‌మమంలోనే అజ్ఞాత వ్యక్తి రాళ్లతో దాడికి పాల్ప‌డి…అక్క‌డ్నుంచి పారిపోయాడు. పోలీసులు ఎంతగా ఆ అజ్ఞాత వ్యక్తి క‌నిపించ‌కుండా ముచ్చెమ‌ట‌లు ప‌ట్టిస్తున్నాడు.

ఇటువంటి సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు గ్రామాల్లో ప‌రిస్థితులు ఎలా ఉంటాయో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. వంతులు వేసుకోని మ‌రీ ప్ర‌జ‌లు త‌మ గ్రామాలకు తెల్ల‌వార్లు కాప‌లా కాస్తున్నారు. అజ్ఞాత వ్యక్తి ఆచూకి ఇంత‌వ‌ర‌కు ల‌భ్యం కాక‌పోవ‌డంతో…ఇదంతా దుష్ట శక్తుల పనే అని ఆందోళన చెందుతున్నారు. అధికారులు త్వ‌రిత‌గ‌తిన‌ స్పందించి త‌మ‌ను కాపాడుకోవాల‌ని వేడుకుంటున్నారు.

కాగా ఇటువంటి స‌మ‌యాల్లో ప్ర‌జ‌ల‌ను చైతన్య ప‌రచ‌డం ఎంతో న‌మ్మ‌కం. లేక‌పోతే వారు భూత వైద్యుల‌ను ఆశ్ర‌యించి..మూఢ నమ్మ‌కాల‌ను మ‌రింత ప్ర‌చారం చేసే అవ‌కాశం ఉంటుంది. జ‌న చైత‌న్య వేదిక కూడా గ్రామాల్లో పర్య‌టించి వారి అప‌నమ్మ‌కాల‌ను పోగొట్టాల్సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.