ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్..

సంక్షేమ పధకాల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. రేపటి నుంచి సెప్టెంబర్ నెల పింఛన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్దం చేసింది.

ఏపీలో పింఛన్‌దారులకు గుడ్ న్యూస్..
Elders
Follow us

|

Updated on: Aug 31, 2020 | 4:11 PM

Pensions Distribution: సంక్షేమ పధకాల విషయంలో ఏపీ ప్రభుత్వం వెనకడుగు వేయట్లేదు. రేపటి నుంచి సెప్టెంబర్ నెల పింఛన్లను పంపిణీ చేసేందుకు సర్వం సిద్దం చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61.68 లక్షల మందికి పించన్లు పంపిణీ చేయనుండగా.. ఈ నెల కొత్తగా మరో 90,167 మందికి కూడా పించన్లు ఇవ్వనున్నట్లు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు.

కరోనా వైరస్ వ్యాప్తి క్రమంలో ఏప్రిల్ నుంచి బయోమెట్రిక్ విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనితో అప్పటి నుంచి జియో ట్యాగింగ్ ఫొటోలు తీసుకుంటున్నారు. ఫించన్ల పంపిణీ కోసం రూ.1496.07 కోట్లను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిందని మంత్రి వెల్లడించారు. కాగా, రేపు గ్రామ, వార్డు వాలంటీర్లు లబ్దిదారుల చేతికి పించన్లు అందిస్తారని స్పష్టం చేశారు.

Also Read: 

‘వైఎస్సార్ బీమా’ పధకం విధి విధానాలు.. జిల్లాల వారీగా ఫోన్ నెంబర్లు.!

ఏపీ: 1036 గ్రామ, వార్డు వాలంటీర్ల పోస్టులు.. వెంటనే దరఖాస్తు చేసుకోండిలా.!

”టాలీవుడ్‌లో డ్రగ్స్ లేకుండా పార్టీలు జరగవు”..

IPL 2020: ఒకే టీంలో కోహ్లీ, డివిలియర్స్, స్మిత్‌లు.. ఎప్పుడంటే..

సంచలన నిర్ణయం దిశగా జగన్ సర్కార్.. ఆన్‌లైన్‌ రమ్మీపై నిషేధం.!