ట్రంప్ పై ఫైర్.. ప్రసంగ ప్రతిని చించేసిన పెలోసీ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మండిపడ్డారు. మంగళవారం ట్రంప్ సెనేట్ లో స్పీచ్ ఇస్తుండగా.. ఆ ప్రసంగం తాలూకు ప్రతులను ఆమె చించివేశారు. ట్రంప్ అభిశంసన నేపథ్యంలో ఆయనపై వఛ్చిన ఆరోపణలను తోసిపుచ్చడానికి సెనేట్ లో ఓటింగ్ నిర్వహణకు ఒకరోజు ముందు జరిగిందీ ఘటన. పెలోసీని ట్రంప్ తన ట్విట్టర్లో.. ‘ నెర్వస్ నాన్సీ’.. ‘క్రేజీ నాన్సీ’ అంటూ వ్యంగ్యంగా విమర్శించిన విషయం తెలిసిందే. తన  అభిశంసన ప్రక్రియకు […]

ట్రంప్ పై ఫైర్.. ప్రసంగ ప్రతిని చించేసిన పెలోసీ
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Feb 05, 2020 | 11:08 AM

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పై యుఎస్ హౌస్ స్పీకర్ నాన్సీ పెలోసీ మండిపడ్డారు. మంగళవారం ట్రంప్ సెనేట్ లో స్పీచ్ ఇస్తుండగా.. ఆ ప్రసంగం తాలూకు ప్రతులను ఆమె చించివేశారు. ట్రంప్ అభిశంసన నేపథ్యంలో ఆయనపై వఛ్చిన ఆరోపణలను తోసిపుచ్చడానికి సెనేట్ లో ఓటింగ్ నిర్వహణకు ఒకరోజు ముందు జరిగిందీ ఘటన. పెలోసీని ట్రంప్ తన ట్విట్టర్లో.. ‘ నెర్వస్ నాన్సీ’.. ‘క్రేజీ నాన్సీ’ అంటూ వ్యంగ్యంగా విమర్శించిన విషయం తెలిసిందే. తన  అభిశంసన ప్రక్రియకు పెలోసీ ఎంతో ‘చొరవ’ చూపుతున్నారని, కానీ ఈ ప్రక్రియ అంతా పసలేని వట్టి ‘డొల్ల’ కార్యక్రమమని ట్రంప్ చాలాసార్లు తేలిగ్గా కొట్టిపారేశారు. కాగా.. మంగళవారం ట్రంప్ ప్రసంగిస్తున్న సమయంలో.. రిపబ్లికన్లు హర్షాతిరేకంతో చప్పట్లు చరచగా.. డెమొక్రాట్లు హేళనగా కేకలు పెట్టారు. ట్రంప్ ప్రసంగం పక్షపాతపూరితంగా ఉందని, అవాస్తవాలను ప్రతిబింబించిందని సెనేట్ లోని  సీనియర్ డెమొక్రాట్ చక్ షూమర్ ఆరోపించారు. అటు-తను ఈ దేశాధ్యక్షునికి షేక్ హ్యాండ్ ఇవ్వబోగా ఆయన తీసుకోకుండా మౌనం వహించడాన్ని పెలోసీ.. ‘ నాటకీయ చర్య’గా అభివర్ణించారు. ఇందుకు డెమొక్రాట్లు ఆయనకు ‘రుణపడి’ ఉంటారని సెటైర్ వేశారు. సభలోకి ట్రంప్ రాగానే ఆయనకు పెలోసీ షేక్ హ్యాండ్ ఇవ్వబోగా ఆయన స్పందించలేదు. బహుశా ఆ కరచాలనాన్ని ట్రంప్ తిరస్కరించినట్టే అని వైట్ హౌస్ వర్గాలు పేర్కొన్నాయి.