బంగారం ధర లేచి.. పడింది…

బంగారం ధర మరోసారి తగ్గింది. పసిడి ధరలు గురువారం వరుసగా మూడోరజూ దిగివచ్చాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరల పతనం కొనసాగింది.

బంగారం ధర లేచి.. పడింది...
Follow us

|

Updated on: Sep 03, 2020 | 7:50 PM

బంగారం ధర మరోసారి తగ్గింది. పసిడి ధరలు గురువారం వరుసగా మూడోరజూ దిగివచ్చాయి. ఈ ఉదయం కొద్దిగా పెరిగిన బంగారం ధర.. నెమ్మదిగా మధ్యాహ్నంకు పడిపోయింది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు ఒడిదుడుకులతో సాగడంతో దేశీ మార్కెట్‌లోనూ పసిడి ధరల పతనం కొనసాగింది. ఎంసీఎక్స్‌లో పదిగ్రాముల బంగారం 50 రూపాయలు తగ్గి 50,771 రూపాయలు పలికింది. ఇక కిలో వెండి 524 రూపాయలు తగ్గి 65,260 రూపాయలకు దిగివచ్చింది. అంతర్జాతీయంగా వీటి ధరలు తగ్గడమే ఇందుకు కారణమని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం ధర 1934 డాలర్ల వద్ద ట్రేడ్‌ అవుతోంది. అటు వెండి ఔన్సు ధర 27.24 డాలర్లుగా కొనసాగుతోంది. డాలర్‌ బలోపేతం కావడంతో మదుపరులు కరెన్సీలో, షేర్లలో పెట్టుబడులకు మొగ్గుచూపడంతో పసిడికి డిమాండ్‌ తగ్గిందని నిపుణులు పేర్కొన్నారు.

కరోనా కారణంగా తీవ్రంగా దెబ్బతిన్న అమెరికా ఆర్థిక వ్యవస్థ కూడా కోలుకుంటూ ఉండడం మరో కారణం. ఇన్నాళ్లు సురక్షిత పెట్టుబడి సాధనంగా మదుపరులు బంగారాన్ని ఎంచుకోవడంతో ఇటీవల కాలంలో వాటి ధరలు ఆకాశాన్ని తాకిన సంగతి తెలిసిందే.