నాలుగూళ్లలో మద్యం మటాష్.. మహిళలేంచేశారంటే.?

యావత్ దేశంలో ప్రతి ఒక్కరి హృదయంలో తరతరాలకు నిలిచిపోయే వ్యక్తి మహాత్ముడు. అహింస ఆయన మార్గం. ఆయన ఎంచుకొన్న మార్గాన్ని నేటికీ ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తుంటాయి. అయితే మహాత్ముని ఊహల్లో, ఆశయాలలో గ్రామాల గూర్చి, వాటి ఔన్నత్యం గూర్చి చాలా గొప్పగా చెప్పబడింది. గ్రామాలు బాగుండాలని, సౌభాగ్యవంతంగా వుండాలని ఆయన కలలు కనేవారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్, ఇన్ ఇట్స్ విలేజెస్’ అని ఆయన ప్రగాఢ విశ్వాసం. గ్రామ స్వరాజ్యం ఇందుకు తోడ్పడుతుందన్నది ఆయన […]

నాలుగూళ్లలో మద్యం మటాష్.. మహిళలేంచేశారంటే.?
Follow us

| Edited By:

Updated on: Oct 25, 2019 | 12:46 PM

యావత్ దేశంలో ప్రతి ఒక్కరి హృదయంలో తరతరాలకు నిలిచిపోయే వ్యక్తి మహాత్ముడు. అహింస ఆయన మార్గం. ఆయన ఎంచుకొన్న మార్గాన్ని నేటికీ ప్రపంచ దేశాలన్నీ ప్రశంసిస్తుంటాయి. అయితే మహాత్ముని ఊహల్లో, ఆశయాలలో గ్రామాల గూర్చి, వాటి ఔన్నత్యం గూర్చి చాలా గొప్పగా చెప్పబడింది. గ్రామాలు బాగుండాలని, సౌభాగ్యవంతంగా వుండాలని ఆయన కలలు కనేవారు. ‘ది ఫ్యూచర్ ఆఫ్ ఇండియా లైస్, ఇన్ ఇట్స్ విలేజెస్’ అని ఆయన ప్రగాఢ విశ్వాసం. గ్రామ స్వరాజ్యం ఇందుకు తోడ్పడుతుందన్నది ఆయన భావన. పల్లెలే భారతావనికి పట్టుగొమ్మలు అని పేర్కొనేవారు. మరి ఈనాడు గ్రామాల్లో ఆయన ఆశయాలు ప్రతిఫలిస్తున్నాయా? సుఖసంతోషాలతో ఈనాటి పల్లెలున్నాయా? అని ప్రశ్నించుకుంటే.. ఆయన బాటలో పయనించే గ్రామాల్ని భూతద్దంలో పెట్టుకుని చూసినా.. కనిపించడం కష్టమే. అంతేకాదు.. మహాత్ముడి మరో స్వప్నం- సంపూర్ణ మద్య నిషేధం. మద్యాన్ని సేవించడం సమాజానికి ప్రమాదకరమని, దాన్ని “సోషల్ ఈవిల్” అంటూ అభివర్ణించారు. మద్యం తాగడం ఆత్మహత్యా సదృశమని, మత్తుకు బానిసలైనవారు వావివరసలు మరచిపోతారని, వారి అవయవాలు అధీనం తప్పుతాయని, దీనికి విరుగుడుగా మద్యనిషేధం అనివార్యమని పేర్కొన్నారు. మద్యం వల్ల కలిగే చెడు పరిణామాలను మనం నేడు కళ్ళముందే అనేకం చూస్తున్నాం. ఇది మనిషిని ఆర్థికంగా.. శారీరకంగా.. మానసికంగా తీవ్రంగా నష్టపరుస్తోంది. అంతేకాదు ఈ మద్యం మహమ్మారి పచ్చని కాపురాల్లో అన్యూన్యంగా ఉండే భార్యాభర్తల మధ్య చిచ్చిరేపుతుంది కూడా.

ప్రస్తుతం ఎక్కడ చూసినా మద్యం ఏరులైపారుతోంది. గల్లీ.. గల్లీకి బెల్ట్ షాపులు.. దర్శనమిస్తున్నాయి. చాలా మంది మద్యానికి అలవాటు పడి.. కష్టపడి సంపాదించిన సొమ్మును మద్యానికే ఖర్చు పెడుతూ కుటుంబాలను ఆగం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మన తెలుగు రాష్ట్రాల్లో పలు గ్రామాలు మద్యంపై గళమెత్తుతూ మద్యనిషేధానికి నడుంబిగిస్తున్నాయి. అందులో కీలక పాత్రను మహిళలే పోషిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లి జిల్లాలో ఓ నాలుగు గ్రామాలు బాపూజీ కలలు గన్న గ్రామస్వరాజ్యం.. సంపూర్ణ మద్య నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి.

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం భూపతిపూర్, బొంతకుంటపల్లి, సుద్దాల, చిన్న కల్వల గ్రామాలు పూర్తిగా వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నాయి. ఇక్కడి ప్రజలు దాదాపు 90 శాతం వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నవారే. అయితే అన్ని గ్రామాల్లో ఉన్నట్లుగానే ఈ గ్రామాల్లో కూడా బెల్ట్ షాపులు ఉన్నాయి. దీంతో గ్రామస్తులు సాయంత్రం అవ్వడంతోనే మద్యానికి బానిసగా మారి.. చేసిన కష్టార్జితాన్ని మద్యం పాలు చేస్తూ.. కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. దీంతో అక్కడి మహిళలు పదేళ్ల క్రితం ఓ నిర్ణయానికి వచ్చారు. గ్రామంలో బెల్ట్ షాపులు ఉండటానికి వీళ్లేదని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడవుగా మహిళలు, యువత ఈ పనికి శ్రీకారం చుట్టారు. బెల్ట్ షాపులు నడుపుతున్న వారికి ఫెనాల్టీలు విధించడం ప్రారంభించారు. ఆ తర్వాత గ్రామంలో మద్యం సేవించవద్దని నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత ఏర్పడింది. దీంతో అక్కడి మహిళలు మరో నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మద్యం సేవిస్తే.. రూ.500 జరిమానా కట్టాలంటూ మరో నిర్ణయం తీసుకన్నారు. దీంతో గ్రామంలో మెళ్లిగా మద్యం త్రాగడమే మానేశారు. అంతేకాదు గ్రామంలో మద్యానికి బానిసలైన వారికి అవగాహన కల్పించే కార్యక్రమాలకు కూడా అక్కడి యువత శ్రీకారం చుట్టడంతో మద్యం వల్ల వచ్చే అనర్థాలపై అవగాహన పెంచుకున్నారు. దీంతో గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలవుతోంది. దీంతో ఈ గ్రామాల్లోని కుటుంబాలు ఆర్థికంగా కూడా ఎంతో పటిష్టమవుతున్నాయి.

తొలుత ఈ నిర్ణయాన్ని చిన్న కల్వల గ్రామం సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేసింది. ఆ తర్వాత ఈ గ్రామం బాటలో భూపతిపూర్, సుద్దాల, బొంతకుంపల్లి గ్రామాలు కూడా ఆదర్శంగా తీసుకుని.. సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేశాయి. అంతేకాదు.. ప్రస్తుతం ఈ గ్రామాలను ఆదర్శంగా తీసుకుని చుట్టుపక్కల గ్రామాలు కూడా సంపూర్ణ మద్యపాన నిషేధం వైపు అడుగులు వేస్తున్నాయి. అందులో భాగంగా ప్రస్తుతం ఈ ప్రాంతంలో సంపూర్ణ మద్యపాన నిషేధం ఓ ఉద్యమంలా కొనసాగుతోంది. అందులో భాగంగా చుట్టుపక్కల గ్రామాల్లో బెల్ట్ షాపులపై తీవ్ర వ్యతిరేకత వెలువడుతోంది. ముందుగా బెల్ట్ షాపులు మూయించి.. ఆ తర్వాత గ్రామంలో మద్యం సేవిస్తే.. జరిమానా విధించే దిశగా మిగతా గ్రామాలు కూడా నడుంబిగిస్తున్నాయి.

మొత్తానికి బాపూజీ కలలుగన్న గ్రామస్వరాజ్యానికి మన పెద్దపల్లి జిల్లా గ్రామాలు నాందిపలికాయి. మార్పు రావాల్సింది ప్రజల్లో కానీ.. ప్రభుత్వాల్లో కాదు అని ఈ గ్రామాలు చాటిచెబుతున్నాయి. మనం ప్రభుత్వాలను ఎత్తి చూపే బదులు.. మనలో మార్పు వస్తే అన్నీ సాధ్యమే అని సూచిస్తున్నాయి ఈ నాలుగు గ్రామాలు.

కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
వాయిదా పడ్డ నవదీప్‌ సినిమా | సరికొత్త పాత్రలో కనిపించనున్న తమన్నా
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
హెచ్చరిక: ప్రజలారా భద్రం.. తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల వానే..
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!