గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. మెహబూబా ముఫ్తీని కలవనున్న పీడీపీ నేతలు

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి రాజకీయ నేతలను గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగడంతో వారిని గృహ నిర్బంధం నుంచి విముక్తి చేసేందుకు కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీ ప్రతినిధులు బృందం కలవగా.. సోమవారం పీడీపీ ప్రతినిధి బృందం ముఫ్తీని కలువబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఇంటికి […]

గవర్నర్ గ్రీన్‌సిగ్నల్.. మెహబూబా ముఫ్తీని కలవనున్న పీడీపీ నేతలు
Follow us

| Edited By: Srinu

Updated on: Oct 07, 2019 | 1:55 PM

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్ 370 రద్దు తరువాత అక్కడి రాజకీయ నేతలను గృహ నిర్భంధంలో ఉంచిన విషయం తెలిసిందే. అయితే తాజాగా జమ్ముకశ్మీర్, లడాఖ్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో పంచాయితీ ఎన్నికలకు నగారా మోగడంతో వారిని గృహ నిర్బంధం నుంచి విముక్తి చేసేందుకు కశ్మీర్ ప్రభుత్వం అంగీకరించింది. దీంతో ఇప్పటికే నేషనల్ కాన్ఫరెన్స్ వ్యవస్థాపకులు ఫరూక్ అబ్దుల్లాను ఆ పార్టీ ప్రతినిధులు బృందం కలవగా.. సోమవారం పీడీపీ ప్రతినిధి బృందం ముఫ్తీని కలువబోతోంది. ఈ సందర్భంగా ఆమె ఇంటికి వెళ్లనున్న 10 మంది సభ్యుల టీం పంచాయితీ ఎన్నికల గురించి ఆమెతో చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. పంచాయితీ పోరును ఎలా ఎదుర్కొవాలి అనే అంశంతోపాటు, బీజేపీకి పై ఎత్తులు ఎలా వేయాలనే అంశంపై కూడా మెహబూబా ముఫ్తీ వ్యుహ రచన చేసే యోచనలో ఉన్నట్టు సమాచారం.