పేటీఎంలో భారీ మోసం..!

డిజిటల్ వాలెట్ పేటీఎంలో భారీ మోసం బయటపడింది. క్యాష్‌బ్యాక్ రూపంలో ఏకంగా 10 కోట్ల వరకు మోసం జరిగినట్లు ఆ సంస్థ అధికారులు వెల్లడించారు. గ్లోబల్ ప్రొఫెషనల్ సర్వీసెస్‌ సంస్థ ఈవైతో కలిసి రూపొందించిన ఒక ప్రత్యేక టూల్‌తో ఈ మోసాన్ని గుర్తించినట్లు కంపెనీ అధికారి ఒకరు మీడియాకు తెలిపారు.

కొందరు చిరు వ్యాపారులకు భారీగా క్యాష్‌బ్యాక్ లభిస్తున్నట్లు గుర్తించాం. ఇక దీనిపై లోతైన విచారణ చేపడితే 10 కోట్ల మేర మోసం బయటపడింది అని పేటీఎం సీఈఓ విజయ్ శేఖర్ శర్మ పేర్కొన్నారు. సంస్థలోని కొంతమంది కింద స్థాయి ఉద్యోగులు కూడా వారితో కలిసి.. నకిలీ ఆర్డర్లు సృష్టించి క్యాష్‌బ్యాక్ ద్వారా సొమ్మును సొంత ఖాతాల్లోకి మళ్లించారని తెలిసింది. దీనికి సంబంధించిన కొందరిని ఉద్యోగం నుంచి తీసేశామని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని విజయ్ శేఖర్ తెలియజేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *