రివ్యూ: ‘ఆర్‌డిఎక్స్ లవ్’ – కేవలం బీ, సీ సెంటర్లకు మాత్రమే!

టైటిల్ : ‘ఆర్‌డిఎక్స్ లవ్’ తారాగణం : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, నరేష్, ఆమని తదితరులు సంగీతం : రథన్ నిర్మాతలు : సి.కళ్యాణ్ కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శంకర్ భాను విడుదల తేదీ: 11-10-2019 ‘ఆర్ఎక్స్100’ సినిమాతో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ చేసిన మరో బోల్డ్ అటెంప్ట్ ‘ఆర్‌డిఎక్స్ లవ్’. పాయల్ గ్లామర్‌ను హైలైట్ చేస్తూ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కుర్రకారును […]

రివ్యూ: 'ఆర్‌డిఎక్స్ లవ్' - కేవలం బీ, సీ సెంటర్లకు మాత్రమే!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Oct 12, 2019 | 7:28 AM

టైటిల్ : ‘ఆర్‌డిఎక్స్ లవ్’

తారాగణం : పాయల్ రాజ్ పుత్, తేజూస్ కంచర్ల, ఆదిత్య మీనన్, నరేష్, ఆమని తదితరులు

సంగీతం : రథన్

నిర్మాతలు : సి.కళ్యాణ్

కథ ,స్క్రీన్ ప్లే, దర్శకత్వం : శంకర్ భాను

విడుదల తేదీ: 11-10-2019

‘ఆర్ఎక్స్100’ సినిమాతో యూత్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను  ఓ ఊపు ఊపేసిన హీరోయిన్ పాయల్ రాజ్‌ఫుత్ చేసిన మరో బోల్డ్ అటెంప్ట్ ‘ఆర్‌డిఎక్స్ లవ్’. పాయల్ గ్లామర్‌ను హైలైట్ చేస్తూ విడుదల చేసిన టీజర్, ట్రైలర్ కుర్రకారును విపరీతంగా ఆకట్టుకున్నాయి. మరి ‘ఆర్ఎక్స్ 100’ మాదిరిగా ఈ చిత్రం పాయల్‌కు మరో హిట్ అందిస్తుందా లేదో ఈ సమీక్షలో తెలుసుకుందాం.

కథ‌ :

చంద్రన్నపేట గ్రామానికి చెందిన అలివేలు(పాయల్ రాజ్‌పుత్) సేఫ్ సెక్స్, కుటుంబ నియంత్రణ వంటి ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లో అవగాహన కల్పిస్తూ, తన ఊరు సమస్యకు పరిష్కారం కోసం ప్రయత్నిస్తుంది. ఈ నేపథ్యంలో సిద్దు(తేజూస్) అలివేలును చూసిన మొదటి చూపులోనే ప్రేమలో పడతాడు.

అప్పటి నుంచి ఆమె చుట్టూనే తిరుగుతూ ఉంటాడు. అయితే అలివేలు మాత్రం తన లక్ష్యం కోసమే పాటుపడుతుంటుంది. ఈ క్రమంలో సిద్దు ప్రేమను కూడా వాడుకోవాలని భావిస్తుంది. అనుకోని అతిధిగా నారాయణ్(ఆదిత్య మీనన్) అలివేలు జీవితంలోకి వస్తాడు. అప్పటి నుంచి ఆమెకు ఇబ్బందులు మొదలవుతాయి. అసలు అలివేలు ఎవరు? ఆమె ఊరుకు ఉన్న సమస్య ఏంటి? సిద్దు, అలివేలు ప్రేమ ఎలా ముగిసింది? అనే ప్రశ్నలకు సమాధానాలు వెండి తెరపై చూడాల్సిందే.

న‌టీన‌టుల అభినయం:

ఫస్ట్ టైం లేడి ఓరియెంటెడ్ సినిమాలో నటించిన పాయల్ రాజ్‌పుత్.. అన్నీ తానై సినిమాను నడిపించింది. ప్రభుత్వ పథకాల గురించి చెప్పేటప్పుడు ఆమె వాడే డబుల్ మీనింగ్ డైలాగులు కొంచెం ఇబ్బందికరంగా అనిపించినా.. బీ, సీ సెంటర్లకు మాత్రం కిక్కునిస్తాయి. ఇక హీరో తేజూస్ సిద్దు పాత్రలో ప్రేక్షకులను మెప్పించడానికి తనవంతు ప్రయత్నం చేశాడు. అయితే ఇది లేడి ఓరియెంటెడ్ సినిమా కావడంతో పెద్దగా హైలైట్ కాలేదు. అటు హీరో హీరోయిన్ల మధ్య వచ్చే రొమాంటిక్ సన్నివేశాలు మరోసారి ‘ఆర్ఎక్స్100’ చిత్రాన్ని గుర్తుచేశాయి. పాయల్‌ను నుంచి ఈ రెండు అంశాలు ఆశించి వెళ్లిన ఆడియన్స్‌కి మాత్రం ఈ మూవీ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది.

వీరిద్దరి తర్వాత చెప్పుకోవాల్సిన మరొక నటుడు ఆదిత్య మీనన్.. విలన్ పాత్రలో మరోమారు అదరగొట్టాడు. తనదైన శైలి డైలాగ్ మోడ్యులేషన్, హావభావాలతో అభిమానులను కట్టిపడేశాడు. సీఎంగా బాపినీడు, గ్రామస్థుడి పాత్రలో సీనియర్ నటుడు నరేష్ ఫర్వాలేదనిపించారు. కాగా, మిగిలిన వారు తమ పాత్రల పరిధి మేరకు పూర్తి న్యాయం చేశారు.

విశ్లేష‌ణ‌ :

కథలోని కాన్సెప్ట్ ఆసక్తికరంగా ఉన్నా.. దాన్ని వెండితెరపై చూపించడంలో దర్శకుడు పూర్తిగా విఫలమయ్యాడని చెప్పాలి. ఎక్కడా కూడా ఉత్కంఠ అనేది ఉండదు. ముఖ్యంగా మొదటి భాగంలో సోషల్ యాక్టివిస్ట్‌గా పాయల్ చెప్పే డైలాగులు పూర్తిగా అడల్ట్ కంటెంట్ ఉండటంతో ఫ్యామిలీ ప్రేక్షకులకు ఏమాత్రం నచ్చదు.

అసలు కథ గురించి పూర్తిగా మర్చిపోయే.. అనవసరమైన సన్నివేశాలు, అర్ధంపర్ధం లేని డైలాగులతో ప్రేక్షకులను పూర్తిగా బోర్ కొట్టిస్తాడు దర్శకుడు. అంతేకాక వీటి వల్ల మూవీ నిడివి కూడా పెరగడంతో ఫ్యాన్స్ విసుగు చెందుతారు. ‘ఆర్ఎక్స్100’ మాదిరి యువతకు కనెక్ట్ అయ్యేలా టైటిల్ పెడితే సరిపోదు దానిలో కావాల్సినంత కంటెంట్ ఉండాలి.

‘ఆర్ఎక్స్100’ సినిమా హిట్ కావడానికి ఆసక్తికరమైన కథ, అనుకోని ట్విస్టులు ఉండడమే. అంతేకాకుండా ఈ మూవీలో కథలో భాగంగా రొమాంటిక్ సన్నివేశాలు వస్తాయి. కానీ ‘ఆర్‌డిఎక్స్ లవ్’లో మాత్రం అవసరానికి మించి రొమాన్స్ కురిపించారు తప్ప.. అసలు కథపై మాత్రం దృష్టి సారించలేదు. కథలో భాగంగా వచ్చే రొమాన్స్‌కు అర్ధం ఉంటుంది. అంతేకానీ రొమాన్స్, బోల్డ్ సీన్స్ కోసం కథ రాసుకుంటే ఇలాగే ఉంటుంది. దీనితో పాటు ఈ కథకు దర్శకుడు ఇచ్చిన ముగింపు కూడా సిల్లీగా ఉంటుంది. ఏది ఏమైనా అసలు ఇలాంటి సినిమాలో ఏం నచ్చి పాయల్ సైన్ చేసిందో ఎవ్వరికీ తెలియదు.

సాంకేతిక విభాగాల పనితీరు:

చిన్న సినిమా అయినప్పటికీ నిర్మాత ఎక్కడా కూడా రాజీ పడకుండా తెరకెక్కించాడని చెప్పాలి. కెమెరా వర్క్ ఆకట్టుకుంటుంది. సాంగ్స్, బ్యాగ్రౌండ్ మ్యూజిక్ ఓకే. ఎడిటింగ్ మాత్రం పూర్తిగా వైఫ్యలం చెందింది. మంచి సబ్జెక్ట్ అనుకున్న దర్శకుడు శంకర్ భాను.. దాన్ని వెండితెరపై ఆవిష్కరించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. కథకు అవసరం లేని సన్నివేశాలతో మూవీ ఫ్లో పూర్తిగా దెబ్బతీశాడు. హీరోయిన్‌తో చెప్పించే బూతు డైలాగులు.. కేవలం బోల్డ్ కంటెంట్ కోసం జొప్పించినట్లు ఉంటాయి తప్ప కథకు అసలు సంబంధం ఉండదు.

ప్లస్‌ పాయింట్స్‌ :

  • పాయల్ నటన
  • కాన్సెప్ట్

మైనస్‌ పాయింట్స్‌ :

  • కథలో కొత్తదనం లేకపోవడం
  • కొన్ని లాజిక్ లేని సన్నివేశాలు

దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 19, 2024): 12 రాశుల వారికి ఇలా..
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
బూమ్ బూమ్ బుమ్రా.. ముంబై విజయం.. ప్లే ఆఫ్ అవకాశాలు సజీవం
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
కోల్‌కతా మ్యాచ్‌కి గ్రీన్ జెర్సీతో బరిలోకి ఆర్సీబీ.. కారణమిదే
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
దివంగత కమెడియన్ వివేక్‌కు గుర్తుగా.. గొప్ప పని చేసిన హీరో వైభవ్
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
తొలిసారి మొబైల్ నెట్‌వర్క్‌.. గ్రామ ప్రజలతో పీఎం మోదీ మాటమంతీ
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
ఈ మొక్క ఆకులు రోజుకు రెండు నమిలితే చాలు.. షుగర్ ఖతం
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!