జగన్ పాలనలో ఏపీ మూడు ముక్కలు..పవన్ రెచ్చిపోయారా?

అమరావతి ప్రాంత గ్రామాల్లో మంగళవారం సుడిగాలి పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. ఉదయం మందడం వద్ద ప్రారంభించిన యాత్ర అడుగడుగునా ఉత్కంఠ రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జనం మధ్య ఊపు పెంచుతూ జనసేనాని తన యాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటూ వెయిట్ చేయించిన పోలీసులకు పవన్ కల్యాణ్ చుక్కలు చూపించారనే చెప్పాలి. వెలగపూడి ప్రాంతానికి చేరుకుంటున్న తరుణంలో పోలీసులు పవన్ కల్యాణ్‌ను వెయిట్ చేయమని చెప్పారు. […]

జగన్ పాలనలో ఏపీ మూడు ముక్కలు..పవన్ రెచ్చిపోయారా?
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 31, 2019 | 5:36 PM

అమరావతి ప్రాంత గ్రామాల్లో మంగళవారం సుడిగాలి పర్యటించిన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్.. ముఖ్యమంత్రి జగన్‌పై నిప్పులు చెరిగారు. ఉదయం మందడం వద్ద ప్రారంభించిన యాత్ర అడుగడుగునా ఉత్కంఠ రేపింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య జనం మధ్య ఊపు పెంచుతూ జనసేనాని తన యాత్రను కొనసాగించారు. ముఖ్యమంత్రి కాన్వాయ్ వస్తుందంటూ వెయిట్ చేయించిన పోలీసులకు పవన్ కల్యాణ్ చుక్కలు చూపించారనే చెప్పాలి.

వెలగపూడి ప్రాంతానికి చేరుకుంటున్న తరుణంలో పోలీసులు పవన్ కల్యాణ్‌ను వెయిట్ చేయమని చెప్పారు. దాంతో ఆయన అక్కడికక్కడే రోడ్డు మీద బైఠాయించారు. పది నిమిషాలని చెప్పిన పోలీసులు అరగంటకు పైగా తుళ్ళూరు వద్దనే పవన్ కల్యాణ్‌ని నిలువరించారు. దాంతో సహనం నశించిన జనసేనాని.. పోలీసులు ఏర్పాటు చేసిన కంచెను దాటుకుంటూ వెళ్ళిపోయారు. పవన్ కల్యాణ్ దూకుడు చూసిన జనసేన శ్రేణులు, అమరావతి ప్రాంత ప్రజలు ఆయన వెంట ఉత్సాహంతో పరుగులు పెట్టారు.

ఈ సందర్భంగా ప్రసంగించిన పవన్ కల్యాణ్.. ఉమ్మడి రాష్ట్రం విడిపోయిన నాటి నుంచి ఏపీ ప్రజలందరూ బాధలు పడుతూనే వున్నారని అన్నారు. 13 జిల్లాల చిన్న రాష్ట్రం అని…ప్రాంతీయ అసమానతలు వస్తాయి అని..ఆ నాడు జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీ సాక్షిగా ఒప్పుకున్నారని పవన్ కల్యాన్ గుర్తు చేశారు. 33 వేల ఎకరాల రాజధానికి జగన్ అసెంబ్లీలో మనస్ఫూర్తిగా ఒప్పుకున్నారని, ఇప్పుడు ఇలా మూడు రాజధానులంటూ రాష్ట్రాన్ని మూడు ముక్కలు చేసే యోచనలో వున్నారని పవన్ కల్యాణ్ ఆరోపించారు.

ఏపీ ప్రజలు పెద్ద కొడుకులా జగన్‌ని భావిస్తే ఆయన తల్లినీ, చెల్లినీ రోడ్డుపైకి లాగుతున్నారంటూ జనసేనాని విరుచుకుపడ్డారు. అదే సమయంలో తెలుగుదేశం పార్టీ రెండు కళ్ళ సిద్దాంతం నుంచి ఇప్పటికైనా బయటపడాలని డిమాండ్ చేశారాయన.