Breaking News
  • ప్రధాని శంకుస్థాపన చేసిన రాజధానిని మార్చే హక్కు ఎవరికీ లేదు. సుప్రీంకోర్టు, రాష్ట్రపతి ఒప్పుకుంటేనే హైకోర్టు కదులుతుంది-కేశినేని. అమరావతి రక్షణకు పార్లమెంటు వేదికగా పోరాటం చేస్తాం-కేశినేని.
  • చిత్తూరు: తిరుచానూరు పీఎస్‌ నుంచి బేడీలతో పరారైన దొంగ. ట్రాక్టర్‌ దొంగతనం కేసులో నాగరాజును అరెస్ట్‌చేసిన పోలీసులు. దొంగ నాగరాజు కోసం గాలిస్తున్న పోలీసులు.
  • ఢిల్లీ: ఆప్‌ ప్రభుత్వంపై బీజేపీ తీవ్ర విమర్శలు. నిర్భయ దోషులను రక్షించేందుకు ఆప్‌ ప్రభుత్వం యత్నిస్తోంది. కావాలనే న్యాయ ప్రక్రియను ఆలస్యం చేస్తోంది-మనోజ్‌ తివారీ. పోలీసులు తమ పరిధిలో లేరని తప్పించుకోవాలని ఆప్‌ చూస్తోంది -బీజేపీ ఢిల్లీ చీఫ్‌ మనోజ్‌ తివారీ.
  • అనంతపురం: తాడిపత్రిలో కత్తిపోట్లు. డబ్బుల విషయంలో స్నేహితుల మధ్య ఘర్షణ. రాము అనే వ్యక్తిని కత్తితో పొడిచిన రవితేజ. ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందిన రాము.
  • రైతులు కన్నీళ్లు పెట్టినా సీఎం మనసు కరగడం లేదు. రాష్ట్రంలో పోలీస్‌ రాజ్యం నడుస్తోంది-దేవినేని ఉమ. విశాఖలో భూదందా నడుస్తోంది-మాజీ మంత్రి దేవినేని ఉమ. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం కోసం రాజధానిని విశాఖకు తరలిస్తున్నారు. పులివెందుల పులి డమ్మీ కాన్వాయ్‌తో వెళ్తోంది. దేశ చరిత్రలో డమ్మీ కాన్వాయ్‌తో వెళ్లిన సీఎం చరిత్రలో లేరు. సచివాలయానికి వెళ్లేందుకు మెటల్‌ రోడ్డు వేసుకుంటున్నారు. 5 కోట్ల మంది ప్రజలు రేపు రోడ్లపైకి రావాలి-దేవినేని ఉమ.

పవన్ డబుల్ ధమాకా.. ‘పింక్‌’తో పాటు..!

Pawan Kalyan re-entry in tolywood, పవన్ డబుల్ ధమాకా.. ‘పింక్‌’తో పాటు..!

‘పింక్’ రీమేక్‌తో పవన్ కల్యాణ్ రీ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. దీనిపై ఆయన అధికారిక ప్రకటన ఇవ్వనప్పటికీ.. ప్రీ ప్రొడక్షన్ పనులు మాత్రం వేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇక వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తోన్న ఈ చిత్రాన్ని బోని కపూర్, దిల్ రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ చిత్రం త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుందట. ఈ నెల 20 నుంచి పవన్ ఈ మూవీ షూటింగ్‌లో పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలోనూ పవన్ నటించబోతున్నట్లు టాలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఈ రెండు చిత్రాల కోసం నెల రోజులను కేటాయించినట్లు తెలుస్తోంది.

మొదటి 20 రోజులు పింక్ రీమేక్‌కు, మరో పది రోజులు క్రిష్‌కు పవన్ కేటాయించినట్లు సమాచారం. ఈ రెండు చిత్రాల కోసం రూ.50కోట్ల రెమ్యునరేషన్‌తో పాటు లాభాల్లో వాటా తీసుకోబోతున్నట్లు టాక్. ఇక ఈ రెండు చిత్రాలతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తోనూ పవన్ అడ్వాన్స్ తీసుకోగా.. వారి నిర్మాణంలోనూ ఓ చిత్రంలో నటించబోతున్నారట. దీనికి హరీష్ శంకర్ దర్శకత్వం వహించే అవకాశం ఉన్నట్లు టాలీవుడ్‌లో టాక్ నడుస్తోంది. ఒకవేళ ఇదే నిజమైతే.. పవన్ కల్యాణ్ డబుల్ కాదు ట్రిపుల్ ధమాకా అవ్వనుంది.