బ్రేకింగ్: బీజేపీ అధినేతతో పవన్ కల్యాణ్ భేటీ

రెండ్రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పీ.నడ్డాతో భేటీ అయ్యారు. నిజానికి శనివారం రాత్రే వీరిద్దరు కలుస్తారని ప్రచారం జరిగినా.. కారణాలు వెల్లడించకపోయినా.. సోమవారం దాకా పవన్ కల్యాణ్ నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పవన్ కల్యాణ్.. తన పార్టీ సహచరుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి జెపీ నడ్డాను కలుసుకున్నారు. ఏపీలో కొనసాగుతున్న […]

బ్రేకింగ్: బీజేపీ అధినేతతో పవన్ కల్యాణ్ భేటీ
Follow us

|

Updated on: Jan 13, 2020 | 2:34 PM

రెండ్రోజుల క్రితం ఢిల్లీకి చేరుకున్న జనసేన అధినేత పవన్ కల్యాణ్.. సోమవారం మధ్యాహ్నం బీజేపీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ జె.పీ.నడ్డాతో భేటీ అయ్యారు. నిజానికి శనివారం రాత్రే వీరిద్దరు కలుస్తారని ప్రచారం జరిగినా.. కారణాలు వెల్లడించకపోయినా.. సోమవారం దాకా పవన్ కల్యాణ్ నిరీక్షించాల్సి వచ్చింది. ఎట్టకేలకు సోమవారం మధ్యాహ్నం బీజేపీ అధిష్టానం నుంచి పిలుపు రావడంతో పవన్ కల్యాణ్.. తన పార్టీ సహచరుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్‌తో కలిసి జెపీ నడ్డాను కలుసుకున్నారు.

ఏపీలో కొనసాగుతున్న రాజధాని రగడపై పవన్ కల్యాణ్ తాజా పరిస్థితిని బీజేపీ అధిష్టానానికి వివరించేందుకు ఆయన్ని కలుసుకున్నట్లు తెలుస్తోంది. మూడు రాజధానుల ప్రతిపాదనతో ఏపీవ్యాప్తంగా గందరగోళం నెలకొందని పవన్ కల్యాణ్ భావిస్తున్నారు. ఇదే అంశాన్ని బీజేపీ అధిష్టానానికి వివరించి, జాతీయ స్థాయిలో జరగాల్సిన తంతును ఆయనకు నివేదించనున్నట్లు తెలుస్తోంది. పదేళ్ళపాటు హైదరాబాద్‌ను ఉమ్మడి రాజధానిగా వాడుకునే అవకాశం వున్నప్పటికీ.. సొంత రాజధాని నిర్మించుకోవాలన్న ఆకాంక్షతో అమరావతిని ఎంపిక చేసుకుని, గత అయిదేళ్ళుగా దాన్ని అభివృద్ధి చేసుకుంటున్నామని, ఈక్రమంలో రాజధానిని తరలిస్తామనడం ఏపీ అభివృద్ధికి విఘాతంగా మారిందని పవన్ కల్యాణ్ బీజేపీ నేతలకు వివరించారని సమాచారం.

హైదరాబాద్‌ను కోల్పోయిన ఏపీకి కొత్త రాజధానిని ఎంపిక చేయడంతో కేంద్రానికి కూడా బాధ్యత వున్నందున ఈ విషయంలో బీజేపీ అభిప్రాయం కీలకమని జనసేనాని భావిస్తున్నారు. అందుకే రాజధాని విషయంలో బీజేపీ జోక్యాన్ని ఆశిస్తున్నట్లు సమాచారం.

మళ్ళీ పొత్తు ప్రస్తావన?

బీజేపీ అధిష్టానంతో సంప్రదింపులు జరుపుతున్న జనసేన చీఫ్… త్వరలో ఏపీలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీతో కలిసి పనిచేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. సోమవారం నాటి జేపీ నడ్డా భేటీలో ఈ అంశం కూడా ప్రస్తావించి, బీజేపీ అధినేతల అభిమతాన్ని పవన్ కల్యాణ్ తెలుసుకుంటారని అంటున్నారు.