Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

నా ఓటమికి మీరే కారణం.. జన సైనికులపై పవన్ అసహనం..!

Pawan unhappy with fans behavior, నా ఓటమికి మీరే కారణం.. జన సైనికులపై పవన్ అసహనం..!

‘మీరు సరిగ్గా లేకే నేను ఓడిపోయా’ అంటూ జన సైనికులను జన సేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అసహనం వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా మండపేటలో ఏర్పాటు చేసిన రైతు సదస్సులో మాట్లాడిన పవన్.. ఫ్యాన్స్‌పై అసంతృప్తిని వ్యక్తం చేశారు. రైతు సమస్యలపై పవన్ మాట్లాడే సమయంలో ఫ్యాన్స్ అరుపులు, కేకలు వేశారు. దీంతో కాస్త ఇబ్బందికి ఫీల్ అయిన ఆయన.. జనసేన కోసం మీరు సైనికులే. కానీ మీరు ఇట్లా చేయకూడదు కదా. అరవొద్దు దయచేసి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు. క్రమశిక్షణ లేని వారు మీరు ఏం చేయలేరు. మీరు సరిగ్గా లేకపోవడం వల్లే నేను ఓడిపోవల్సి వచ్చింది. అది మర్చిపోకండి. నిజంగా ఇబ్బందిగా ఉంది నాకు మీతోటి. ఎందుకుంటే మీకు క్రమశిక్షణ లేదు. క్రమశిక్షణ ఉండుంటే జనసేన గెలిచుండేది. ప్రత్యర్థులు, శత్రువులు దెబ్బ కొడతారు. మీకేమో క్రమశిక్షణ లేదు అని వ్యాఖ్యలు చేశాడు. అయితే ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలోనూ ఫ్యాన్స్ అరుపులు, కేకలు ఆగకపోగా.. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

కాగా ఇదే సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేశారు పవన్. రైతుల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించడం లేదని ఆయన దుయ్యారబట్టారు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం అయ్యే మూడు రోజుల్లో రైతులకు లాభసాటి లేదా గిట్టుబాటు ధర కల్పించాలని.. లేదంటే తాను కాకినాడలో 24గంటల దీక్షకు కూర్చుంటానని అన్నారు. రైతు కన్నీరు పెట్టే రాజ్యం సుభిక్షంగా ఉండదని.. రైతు కన్నీరు రాష్ట్రానికి శాపం అవుతుందని ఆయన విమర్శించారు. పాదయాత్రలు చేసి ముద్దులు పెడితే రైతుల కడుపు నిండదని పవన్ ఈ సందర్భంగా కామెంట్లు చేశారు.