జగన్‌కు పవన్ లేఖ..! ఏముందో చూశారా..?

Pawan kalyan writes a letter to ap cm Jagan, జగన్‌కు పవన్ లేఖ..! ఏముందో చూశారా..?

జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్.. ఏసీ సీఎం జగన్మోహన్‌ రెడ్డికి లేఖ రాశారు. కొత్త ప్రభుత్వం స్థిరపడడానికి కొంత సమయం కావాలి.. కాబట్టి.. వందరోజుల సమయం ఇస్తున్నామన్నారు. కానీ.. ఈలోగా జగన్ పాలనపై ఎన్ని ఫిర్యాదులు వచ్చినా జనసేన స్పందించడంలేదని చెప్పుకొచ్చారు. అయితే.. భవన నిర్మాణ కార్మికులు అర్థాకలితో మాడుతున్నందున తప్పనిసరై లేఖ రాస్తున్నట్లు చెప్పారు పవన్.

సెప్టెంబర్ 5న ఏపీలో కొత్త ఇసుక పాలసీని ప్రభుత్వం ప్రకటిస్తామంది. కానీ.. ఈలోపు రాష్ట్రమంతా నిర్మాణాలు నిలిచిపోయాయి. మరి ఈలోపు రెక్కాడితే గానీ.. డొక్కాడని కుటుంబాల పరిస్థితి ఏంటనిప్రశ్నించారు పవన్. భవన నిర్మాణ కార్మికులకు ఉపాధి కల్పించేందుకు తక్షణం నిర్ణయం తీసుకుని.. ఓ భరోసా ఇవ్వాలన్నారు పవన్. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలు.. ఇకపై జరగకుండా కొత్త ఇసుక పాలసీని తీసుకురావాలని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *