‘హంగ్’ కావాలా పవన్..!

‘‘ఎప్పుడూ ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది’’ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాటలు ఇవి. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం ప్రచారాలు మాత్రమే చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అభివృద్ధి ఏ మాత్రం జరగదన్నది జగమెరిగిన సత్యం. దానికి భారత చరిత్రలో ఎన్నో ఉదాహరణలు […]

‘హంగ్’ కావాలా పవన్..!
Follow us

| Edited By: Srinu

Updated on: Mar 07, 2019 | 4:38 PM

‘‘ఎప్పుడూ ఒకే వ్యక్తికి అధికారం ఇస్తే పాలన అస్తవ్యస్తంగా మారుతుంది. అందుకే సంకీర్ణ ప్రభుత్వాలు రావాల్సిన అవసరం ఉంది’’ తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ అన్న మాటలు ఇవి. ఇప్పటివరకు ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయకుండా కేవలం ప్రచారాలు మాత్రమే చేస్తున్న పవన్ కల్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారింది.

సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పడినప్పుడు అభివృద్ధి ఏ మాత్రం జరగదన్నది జగమెరిగిన సత్యం. దానికి భారత చరిత్రలో ఎన్నో ఉదాహరణలు ఉన్నాయి. అంతెందుకు ప్రస్తుతం మన పక్క రాష్ట్రం కర్ణాటకలో నడుస్తున్నది సంకీర్ణ ప్రభుత్వం. అక్కడ జరిగే నాటకీయ పరిణామాలు రోజూ చూస్తూనే ఉన్నాం.

కర్ణాటకలో కాంగ్రెస్- జేడీఎస్ ప్రభుత్వం ఏర్పడి కొన్ని నెలలు గడుస్తున్నా.. పార్టీల మధ్య సయోధ్య కుదరడం లేదు. ఆ క్యాంపుల్లో ఎమ్మెల్యేలు కొట్టుకోవడాలు, ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నాలకు సంబంధించిన ఆడియో టేపులు బయటకు రావడం.. ఇలా రోజుకో రచ్చ నడుస్తుంది తప్ప ప్రజలకు జరిగిన అభివృద్ధి అంటూ ఏమీ లేదు. అంతెందుకు జమ్ముకశ్మీర్‌లో హంగ్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కూడా గడవకముందే ఆ ప్రభుత్వాల మధ్య గొడవలు రావడం.. ఇప్పుడు అక్కడ గవర్నర్ పాలన రావడం దేశమంతా చూసింది. ఇలా ఇదంతా తెలిసిన ఎవ్వరైనా సంకీర్ణ ప్రభుత్వాలు వద్దనే అనుకుంటారు. కానీ అందుకు భిన్నంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేయడం హాస్యాస్పదమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి హంగ్ కావాలనుకుంటున్న పవన్ మాటల వెనుక ఉద్దేశ్యం ఏంటో..?