Pawan Kalyan on Political journey: రాజకీయ రహస్యాన్ని వెల్లడించిన పవన్

జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను రాజకీయాల్లోకి ఎందుకొచ్చానో ప్రకటించారు. తన రాజకీయ రంగ ప్రవేశం వెనుకున్న రహస్యాన్ని ఢిల్లీ వేదికగా జరిగిన ఓ సెమినార్‌లో వెల్లడించేశారు.

Pawan Kalyan on Political journey: రాజకీయ రహస్యాన్ని వెల్లడించిన పవన్
Follow us

|

Updated on: Feb 20, 2020 | 6:59 PM

Pawan Kalyan revealed secret behind his political entry: జనసేన అధినేత పవన్ కల్యాణ్ తాను రాజకీయాల్లోకి ఎందుకొచ్చానో ప్రకటించారు. తన రాజకీయ రంగ ప్రవేశం వెనుకున్న రహస్యాన్ని ఢిల్లీ వేదికగా జరిగిన ఓ సెమినార్‌లో వెల్లడించేశారు. రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు మార్పు రాదని తేల్చేశారు పవన్ కల్యాణ్.

ఢిల్లీ పర్యటనలో వున్న పవన్ కల్యాణ్.. ఇండియన్ స్టూడెంట్ పార్లమెంట్‌లో విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. సమాజం కోసం ఏదో ఒకటి తన వంతుగా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి వచ్చానని, ఉమ్మడి రాష్ట్రాన్ని విడదీసిన విధానం నచ్చక.. ఏదైనా చేయాలన్న ఉద్దేశంతో రాజకీయాల్లోకి అడుగు పెట్టానని పవన్ కల్యాణ్ వెల్లడించారు.

మహాపురుషుల జీవిత చరిత్రలు చదివిన అనుభవంతో ఒక భావజాలం కోసం తాను ఎదురుచూసినట్లు చెప్పుకున్నారాయన. ‘‘సోషలిజం సహా అనేకం చదివాను.. జర్మనీ విభజన.. ప్రపంచవ్యాప్త పరిణామాలు అర్థం చేసుకున్నాను.. దేశంలో అవినీతి, నెపోటిజం నన్ను బాగా కలచివేసింది.. వారసత్వ రాజకీయాలు నన్ను బాధించాయి.. రాష్ట్రం విభజన జరిగిన తీరు చూశాక.. సైలెంట్‌గా కూర్చోలేక.. జనంలోకి వచ్చాను..’’ అంటూ తన రాజకీయ ప్రయాణం వెనుకున్న కారణాలను విద్యార్థులకు వివరించారు.

దేశానికి ఏదైనా చేయాలి అనుకున్నప్పుడు.. చిత్తశుద్ధితో పనిచేయాలన్నారు పవన్ కల్యాణ్. భగత్ సింగ్ త్యాగం నేటికీ ఎందరికో స్ఫూర్తిదాయకమని అన్నారాయన. తన రాజకీయ ప్రయాణంలో తొలి విజయం కర్నూలు బాలిక సుగాలి ప్రీతి కేసును సీబీఐకి అప్పగించేలా జగన్ ప్రభుత్వాన్ని ఒప్పించడమేనని చెప్పుకున్నారు పవన్. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ హామీ ఇచ్చిన సంగతి గుర్తు చేశారు.

చట్ట సభలకు వెళ్ళడం కంటే బాధిత, పీడిత వర్గాలకు అండగా నిలబడడమే తనకు ముఖ్యమని చెప్పుకున్నారు. రాజకీయాల్లోకి రావాలనుకునే వారు షార్ట్ టర్మ్ ప్లాన్‌తో రావొద్దు.. దీర్ఘకాలిక లక్ష్యంతో ముందడుగు వేయాలని పవన్ కల్యాణ్ పిలుపునిచ్చారు. సోషల్ మీడియాలో మంచి కూడా ఉందని, నిర్మాణాత్మకంగా వ్యవహరించేవారు కూడా ఉన్నారని చెబుతున్నారు పవన్. పాతికేళ్లపాటు ఉండే లక్ష్యంతో రాజకీయాల్లోకి వచ్చానని, అధికారమే పరమావధిగా రాలేదని జనసేన అధినేత చెబుతున్నారు.

Also read: AP CM Jagan no to CBI inquiry into YS Viveka murder case