Breaking News
  • చెన్నై, రజనీకాంత్ అల్లుడు, నటుడు ధనుష్ కు మదురై హైకోర్టు షాక్. దనుష్ జనన, విద్య, ఇంటికి సంబందించిన ఒరిజినల్ సర్టిపికెట్లు ఎక్కడ. ఇంత జరుగుతున్నా దనుష్ జనన సర్టిఫికేట్ ఎందుకు సబ్మిట్ చేయలేదు దనుష్ తమ కుమారుడంటూ పిటిషన్ వేసిన కదిరేశన్ కేసులో మదురై హైకోర్టు ఆగ్రహం. తక్షణమే అన్ని ఒరిజినల్ సర్టిపికెట్టు న్యాయస్థానంలో పొందుపర్చండి. చెన్నై కార్పోరేషన్ కు మదురై హైకోర్టు ఆదేశం.
  • ఫ్యాన్సీ నెంబర్లతో కాసుల పంట పండిస్తున్న రవాణాశాఖ. నిన్న ఆన్లైన్ బిడ్డింగ్లో 31,43,887 లక్షల ఆదాయం. ఖైరతాబాద్ లో అత్యధిక ఆదాయం పలికిన మూడు ఫ్యాన్సీ నెంబర్లు. టీఎస్ 09 ఎఫ్ కె 9999 నెం.కు ఆర్ఎస్ బ్రదర్స్ సంస్థ 9.14 లక్షలు. లహరి ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ టీఎస్ 09ఎఫ్ ఎల్ 0001 నెంబర్కు 3,81,111 లక్షలు. టీఎస్ 09 ఎఫ్ ఎల్ 279 నెంబర్ అస్మిత పద్మనాభన్ 3.33 లక్షలు. ఖైరతాబాద్లో విఐపి జోన్ ఎక్కువగా ఉండడం కలిసొస్తుంది. 9999 కు ఎక్కువ క్రేజ్. ప్రతి సంవత్సరము ఈ నెంబర్ దాదాపు 10 లక్షలు పలుకుతోంది. ఫిబ్రవరి 10 నుండి ఆన్లైన్ రిజర్వేషన్లు అమలు . ఈ ఆన్లైన్ విధానం రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు విస్తరిస్తాము. హైదరాబాద్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ పాండు రంగ నాయక్.
  • టిటిడి చైర్మన్ వైవి సుబ్బారెడ్డి కామెంట్స్. గరుడ వారధి పిల్లర్లపై శ్రీవారి నామాలు ముద్రణ నిలిపివేశాము. శ్రీవారి నామాలు పై నుంచి వాహనాలు వెళ్లడం మంచిది కాదని భక్తులు కొంతమంది అభ్యంతరం వ్యక్తం చేశారు. పిల్లర్లపై శ్రీవారి నామాలు ముద్రణ అనేది గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం.
  • తాడేపల్లి నివాసం సీఎం జగన్ తో రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ భేటీ. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటు అంశాలపై సీఎం జగన్ తో చర్చినచనున్న ముఖేష్ అంబానీ. అంబానీతో పాటుగా కుమారుడు అనంత్ అంబానీ, రాజ్యసభ సభ్యుడు, పారిశ్రామికవేత్త పరిమల్ నత్వాని.
  • చెన్నై పోలీసులు ఖాకీ సినిమా చూపించిన రాజస్థాన్ ఒఎల్ ఎక్స్ దొంగల ముఠా. OLX పోర్టల్ ఉపయోగించి వంద కోట్లకు పైగా మోసం చేసిన ముఠా అరెస్టు . రాజస్థాన్ లోని దునావల్,భరత్ పూర్ గ్రామంలో చెన్నై పోలీసులకు చుక్కలు చూపించిన గ్రామస్థులు . ముఠా సభ్యులను అరెస్టు చేయకుండా అడ్డుకున్న గ్రామస్థులు. గ్రామస్థులతో గొడవలు పడి చివరకు నరేష్ పాల్ సింగ్, బాచు సింగ్ లను అరెస్ట్ చేసినా చెన్నై క్రైం పోలీసులు. సైనిక వాహనాలైన కారు,బైకులు ,ఇతర ప్రైవేట్ బైక్స్,కార్లు తక్కువ ధరకు తీసిఇస్తామని వందకోట్లపైనే మోసం. తమిళనాడు,కర్నాటక కేరళ,ఎపి,తెలంగాణాలో వేల సంఖ్యలో మోసాలు పాల్పడిన ముఠా. ఊరులోని మూడు వందలకు పైగా కుటుంబాలు olx మోసాలు పాల్పపడుతున్నట్లు గుర్తింపు . వచ్చిన డబ్బుతో జల్సాలు చేస్తున్న గ్రామస్థులు .
  • చంద్రబాబు కాన్వాయ్ అడ్డగింపు వ్యవహారం. 47 మందికి పైగా నిరసనకారులపై కేసులు. 35 మందికి పైగా వైసీపీ మద్దతుదారులు, 11 మంది టీడీపీ కార్యకర్తలు, మద్దతుదారులపై కేసులు పెట్టిన ఎయిర్ పోర్ట్ పోలీసులు . జెటి రామారావు సహా పలువురినిఅదుపులోకి తీసుకున్న పోలీసులు . మరికాసేపట్లో పలువురిని అరెస్ట్ చేసే అవకాశం.

ఆ ఇద్దరిపై పవన్ కళ్యాణ్ విసుర్లు..పేర్లెందుకు ప్రస్తావించలేదంటే..?

Pawan Kalyan Slams Cm Jagan, ఆ ఇద్దరిపై పవన్ కళ్యాణ్ విసుర్లు..పేర్లెందుకు ప్రస్తావించలేదంటే..?

ఏపీ సీఎం వైఎస్ జగన్‌పై పవన్ కళ్యాణ్ విమర్శనాస్త్రాలు సంధించారు. బుధవారం ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. అనంతరం మాట్లాడిన పవన్… వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సీబీఐ కేసుల భయం పట్టుకుందని ఆరోపించారు. తనపై కేసులు ఉన్నాయనే సీఎం రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీపడుతున్నారని…అందుకే  ఢిల్లీలో కేంద్రమంత్రుల దగ్గర రాష్ట్ర ప్రాజెక్టుల గురించి బలంగా మాట్లాడలేకపోయారని అన్నారు.

ఇసుక మాఫియా ఇప్పుడు కూడా జరుగుతోందని పవన్‌ విమర్శించారు. గతంలో టీడీపీ నేతలు చేసిన తప్పులే ఇప్పుడు వైసీపీ నేతలు చేస్తున్నారని.. దీనిలో పెద్దగా తేడా ఏమీ లేదని వ్యాఖ్యానించారు. ప్రభుత్వాన్ని నడిపేవారు హింసను ప్రోత్సహించకూడదన్నారు. మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో ఎందుకు పురోగతి లేదని పవన్‌ ప్రశ్నించారు.

భవన నిర్మాణ కార్మికుల కష్టాలపై నవంబర్ 3న విశాఖపట్నంలో నిర్వహించనున్న ఛలో విశాఖ కార్యక్రమం పోస్టర్‌ను పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఒంగోలులో జరిగిన సమావేశంలో ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గం, అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ తోపాటు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు.

Pawan Kalyan Slams Cm Jagan, ఆ ఇద్దరిపై పవన్ కళ్యాణ్ విసుర్లు..పేర్లెందుకు ప్రస్తావించలేదంటే..?

Related Tags