Breaking News
  • భారత్ లో విజృంభిస్తున్న “కరోనా” వైరస్. 7 లక్షల 42 వేలు దాటిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య . గడచిన 24 గంటలలో అత్యధికంగా 22, 752 కరోనా పాజిటివ్ కేసులు నమోదు. • గడచిన 24 గంటలలో దేశంలో “కరోనా” వల్ల మొత్తం 482 మంది మృతి • దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 7,42,417 • దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 2,64,944 • “కరోనా” కు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 4,56,830 • “కరోనా” వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 20,642 గడచిన 24 గంటలలో దేశ వ్యాప్తంగా 2,62,679 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు ఇప్పటి వరకు దేశంలో 1,04,73,771 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు
  • తెలంగాణలో భారీ వర్ష సూచన . మెదక్, సిద్దిపేట, రాజన్నసిరిసిల్ల, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి, జనగామ, యాదాద్రి భువనగిరి, వికారాబాద్ జిల్లాలలో భారీ వర్షాలు . ఉత్తర కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లో 5.8 km ఎత్తు వద్ద బలహీనపడిన ఉపరితల ఆవర్తనం . అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు. ఎల్లుండి తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు చాలా చోట్ల కురిసే అవకాశం . వాతావరణ శాఖ సీనియర్ సైంటిస్ట్ రాజారావు.
  • విశాఖ: ఎల్జీ పాలిమర్స్ కేసు . 12 మంది నిందితులను సెంట్రల్ జైల్ కు తరలించిన పోలీసులు . 22 వరకు రిమాండ్ విధించిన కోర్ట్.. జ్యుడీషియల్ కస్టడీకి అప్పగిస్తున్న పోలీసులు . ద్వారకా ఏసీపీ కార్యాలయం నుంచి సెంట్రల్ జైలుకు తరలింపు.
  • తబ్లీగీ జమాత్ విదేశీ సభ్యులకు ఢిల్లీ కోర్టు బెయిల్. రూ. 10,000 పూచీకత్తుపై బెయిల్ మంజూరు. బెయిల్ పొందినవారిలో బ్రెజిల్, ఆస్ట్రేలియా, ఫిజీ, చైనా, ఫిలిప్పీన్స్ జాతీయులు. వీసా నిబంధనలు ఉల్లంఘిస్తూ, చట్ట వ్యతిరేకంగా తబ్లీగీ జమాత్‌లో పాల్గొన్నందుకు కేసులు పెట్టిన ప్రభుత్వం.
  • జూబిలీహిల్స్ పబ్లిక్ స్కూల్ ఇన్స్పెక్షన్ చేసిన పాఠశాల విద్యాశాఖ జాయింట్ డైరెక్టర్, హైద్రాబాద్ డీఈఓ. నిబంధనలు పాటించడం లేదని పిర్యాదు లు రావడం తో తనిఖీ లు . కొన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వెళ్లిన అధికారులు.. మరి కొన్ని డాక్యుమెంట్స్ సమర్పించాలని యాజమాన్యానికి ఆదేశం. ఫైల్స్ మెయింటైన్స్ సరిగా లేవని,పారదర్శకంగా లేవని ప్రాథమిక అంచనాకు వచ్చిన అధికారులు.
  • యాంటిజెన్ టెస్ట్ లు uphc లలో ప్రారంభం. Ghmc లో 50 సెంటర్స్ లో రంగారెడ్డి లో 20 సెంటర్స్. మేడ్చల్ లో 20 సెంటర్స్. ఒక్కో uphc లో మ్యాక్సీమం 25 శాంపిల్స్ తీసుకోవాలని అధికారుల ఆదేశాలు. సింటమ్స్ ఉన్నవారికి, కాంటాక్ట్ హిస్టరీ ఉన్నవారికి టెస్ట్ లు. ఎవరిని సెలెక్ట్ చెయ్యాలో అర్ధం కాని హెల్త్ సిబ్బంది. 30 నిమిషాలలో రిజల్ట్ కావడం తో కరోనా అనుమానితులు మాకు మాకు చెయ్యండి అని ముందుకు వస్తున్నారు. 15 నుంచి 30 నిమిషాలలో రిపోర్ట్ రావాలి .. లేదంటే ఫాల్స్ రిజల్ట్ గా పరిగణిస్తారు. అన్ని శాంపిల్స్ ను తీసుకుని , టైమర్ పెట్టుకుని పరీక్షించాల్సి ఉన్న టెక్నిషియన్.
  • టీవీ9 తో ఉస్మానియా ప్రొఫెసర్ వెంకటేశ్వర్లు. గాలి లో కూడా కరోన కణాలు ఉండి పోతాయి. తుమ్మితే, దగ్గితేనే కాదు , గాలి పీల్చడం ద్వారా కూడా కరోన వ్యాప్తి జరుగుతుంది. పొల్యూషన్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో కరోనా వైరస్ గాలి లో ఎక్కువ సేపు నిలబడి పోతుంది. అందుకే మెట్రో సిటీస్ లో వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి స్థితి లో ఇళ్లలో ,అప్పర్ట్మెంట్స్ లో ఐసోలేషన్ లో ఉండటం అనేది కూడా ప్రమాధకారమైనదే. క్వాలిటీ ఉన్న మాస్క్ లను , షానిటేజర్లను వాడాలి.

‘పింక్’ కాదు.. అలాంటి స్టోరీ కావాలంటోన్న పవన్..?

Pawan Kalyan re-entry, ‘పింక్’ కాదు.. అలాంటి స్టోరీ కావాలంటోన్న పవన్..?

సినిమాల్లోకి పవన్ కల్యాణ్ రీఎంట్రీపై ఇంకా సందిగ్ధత కొనసాగుతోంది. హిందీలో విజయం సాధించిన ‘పింక్’ రీమేక్‌లో ఆయన నటించబోతున్నారంటూ అధికారిక ప్రకటన వచ్చినప్పటికీ.. పవన్ వెర్షన్‌ మాత్రం మరోలా ఉంది. తాను యాక్ట్ చేస్తానో లేదో తెలీదు కానీ.. సినిమాలను ప్రొడ్యూస్ చేస్తానంటూ ఓ సందర్భంలో చెప్పుకొచ్చాడు పవన్. కానీ ఫిలింనగర్ వర్గాల సమాచారం ప్రకారం పవన్ రీఎంట్రీకి ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని తెలుస్తోంది. వేణు శ్రీరామ్ దర్శకత్వంలో దిల్ రాజు, బోనీ కపూర్ ఈ మూవీని సంయుక్తంగా నిర్మిస్తుండగా.. వారు ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారని తెలుస్తోంది. ఇలాంటి నేపథ్యంలో పవన్‌కు సంబంధించిన మరో వార్త టాలీవుడ్‌లో హల్‌చల్ చేస్తోంది.

అదేంటంటే పింక్ రీమేక్‌పై పవన్ అంతగా ఆసక్తిగా లేడన్నది విశ్వసనీయ వర్గాల సమాచారం. పింక్ ఓ మెసేజ్ ఓరియెంటెడ్ కథనే అయినప్పటికీ.. ఈ మూవీతో కాకుండా ఓ పొలిటికల్ థ్రిల్లర్‌లో నటించాలని పవన్ అనుకుంటున్నారట. ప్రభుత్వంపై పోరాటం చేసే ఓ ప్రతిపక్షనేత చివరకు రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయ్యేందుకు సాగించిన పోరాటాన్ని హైలెట్ చేస్తూ సినిమా తీయాలన్న ఆలోచనలో పవన్ ఉన్నాడట. ఇక ఇలాంటి స్టోరీలో నటించడం. రాజకీయంగానూ తనకు కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయని పవన్ భావిస్తున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో ఉన్న అత్యంత సన్నిహితుల వద్ద ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక ఈ నిర్ణయానికి వారు కూడా మెచ్చుకోవడం జరిగిందని టాక్. ఇదిలా ఉంటే పవన్ రీఎంట్రీ కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇలాంటి సమయంలో పవన్ ఎప్పుడు రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారు..? ఏ కథలో నటించబోతున్నాడు..? ఈ సినిమా ఎప్పుడు విడుదల కానుంది అనే విషయాలు తెలియాలంటే మాత్రం కొద్ది రోజులు ఆగాల్సిందే. కాగా ప్రస్తుతం రాజకీయాల్లో కొనసాగుతున్న పవన్ కల్యాణ్.. ప్రజా సమస్యల తరఫున పోరాటం చేస్తున్నారు. ముఖ్యంగా ఏపీలో వైసీపీ ప్రభుత్వంపై ఆయన విమర్శల పర్వం కొనసాగుతోంది.

Related Tags