Breaking News
  • ప.గో: చింతలపూడి జెడ్పీ పాఠశాలలో లైంగిక వేధింపులు. మహిళా టీచర్‌ను లైంగికంగా వేధిస్తున్న తోటి టీచర్‌. డీఈవో, జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేసిన బాధితురాలు. ముగ్గురు సభ్యులతో విచారణ కమిటీ ఏర్పాటు చేసిన కలెక్టర్‌.
  • తిరుపతి: పలమనేరు అటవీప్రాంతంలో గుప్తనిధుల తవ్వకాల కేసు. 8 మందిపై కేసునమోదు, ఇప్పటికే పోలీసుల అదుపులో ఇద్దరు నిందితులు. నిందితులను పట్టుకునేందుకు రెండు పోలీసు బృందాలు ఏర్పాటు. కీలక నిందితుడు చెన్నైకి చెందిన స్వామీ జయచంద్రన్‌ కోసం గాలింపు. రుయాలో చికిత్సపొందుతున్న బాధితుడు గణేష్‌ పరిస్థితి విషమం. కాలిన గాయాలతో ఈ నెల 12న ఆస్పత్రిలో చేరిన గణేష్‌. గణేష్‌ను నరబలి ఇచ్చేందుకు యత్నించారంటున్న కుటుంబసభ్యులు. విద్యుత్‌షాక్‌తో గణేష్‌ ప్రమాదానికి గురయ్యాడంటున్న పోలీసులు.
  • టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి భూకబ్జా, కేసుల చిట్టా. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.
  • గోపన్‌పల్లి భూవివాదంపై స్పందించిన రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ . కొండల్‌రెడ్డితో అప్పటి తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి కుమ్మక్కయ్యారు. గోపన్‌పల్లి భూ వివాదంలో అప్పటి తహశీల్దార్‌ అవకతవకలకు పాల్పడ్డారు. కొండల్‌రెడ్డికి సంబంధం లేని భూమిని శ్రీనివాస్‌రెడ్డి మ్యుటేషన్‌ చేయించారు. -టీవీ9తో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ అమయ్‌ కుమార్‌. డిప్యూటీ తహశీల్దారు శ్రీనివాస్‌రెడ్డి తన అధికారాలకు విరుద్ధంగా.. రికార్డుల్లో లేనివ్యక్తి భూమిని కొండల్‌రెడ్డికి మ్యుటేషన్ చేయించారు. ఈ వివాదంలో మరో ఇద్దరు తహశీల్దార్ల పాత్ర కూడా గుర్తించాం. తహశీల్దార్‌ శ్రీనివాస్‌రెడ్డి సహా బాధ్యులపై చర్యలు తీసుకోవాలని.. ప్రభుత్వానికి లేఖ రాశాం-టీవీ9తో రంగారెడ్డిజిల్లా కలెక్టర్ అమయ్‌కుమార్.
  • గోపన్‌పల్లి భూవివాదంలో గతంలోనే రేవంత్‌రెడ్డిపై కేసులు. 2016 జనవరి 13న రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై.. గచ్చిబౌలి పీఎస్‌లో ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. గోపన్‌పల్లిలోని భూమిని కబ్జా చేసేందుకు.. ప్రయత్నించారని పోలీసులకు ఫిర్యాదు చేసిన పెద్దిరాజు. రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యపై సెక్షన్‌ 447, 427, 506.. రెడ్‌విత్‌ 34, ఎస్సీ, ఎస్టీ సెక్షన్ల కింద కేసునమోదు. టీవీ9 చేతిలో రేవంత్‌రెడ్డి, కొండల్‌రెడ్డి, లక్ష్మయ్యల చార్జిషీట్‌. 16 మంది సాక్షులను విచారించిన గచ్చిబౌలి పోలీసులు. గోపన్‌పల్లిలోని సర్వేనెంబర్‌ 127లో భూకబ్జాకు ప్రయత్నించారు. అడ్డుకున్నందుకు బాధితులను బూతులు తిట్టినట్టు తేల్చిన పోలీసులు. సర్వేనెంబర్‌ 127లో తమకు చెందని భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నం. కోర్టులో 28 పేజీల చార్జిషీట్‌ దాఖలు చేసిన పోలీసులు.

‘పింక్’ రీమేక్‌లో పవన్ లుక్..రచ్చ చేస్తోన్న లీక్డ్ పిక్స్

Pawan Kalyan's getup in Pink remake leaked, ‘పింక్’ రీమేక్‌లో పవన్ లుక్..రచ్చ చేస్తోన్న లీక్డ్ పిక్స్

పవన్ మళ్లీ మేకప్ వేసుకున్నాడు. కెమెరా ముందుకు వచ్చి యాక్టింగ్ షురూ చేశాడు. అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ ఫిల్మ్ ఇండస్ట్రీకి దూరమయ్యి పాలిటిక్స్‌పై ఫోకస్ పెట్టారు. కానీ ఎన్నికల్లో ఆయన స్థాపించిన జనసేన అంతగా సత్తా చాటలేకపోయింది. ఇటీవలే బీజేపీతో షేక్‌హ్యాండ్ ఇచ్చి బూస్టప్ తెచ్చుకున్న పవన్..తన ఫ్యాన్స్‌ని ఖుషీ చేస్తూ ఫిల్మ్ కెరీర్‌ను రీస్టార్ట్ చేశారు. సూపర్‌హిట్ బాలీవుడ్ మూవీ ‘పింక్‌’ రీమేక్‌తో ఆయన పునరాగమనం చేస్తున్నారు. ఆ మూవీ షూటింగ్ సోమవారం నుంచి స్టార్టయ్యింది.

అయితే ఊహించని విధంగా పవన్ ఆన్‌ లొకేషన్ పిక్స్ లీక్ అయ్యాయి. బ్లాక్ షర్ట్, జీన్ ఫ్యాంట్..గుబురు గడ్డంతో పవర్ స్టార్ నయా లుక్ సాలిడ్‌గా ఉంది. షూటింగ్ స్టార్టయిన తొలి రోజే లుక్ లీకవ్వడం మూవీ యూనిట్‌ను షాక్‌కి గురి చేసింది. అందుకే ఇప్పటినుంచి మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని డిసైడయ్యారట. కాగా దిల్ రాజు, బోని కపూర్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా, వేణు శ్రీరామ్ దర్శకత్వం వహించనున్నారు. ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్న థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు. మరోవైపు సినిమా కోసం అన్నపూర్ణ సెవెన్ ఎకర్స్‌లో భారీ కోర్టు సెట్ వేస్తోన్నారు. మేజర్ షూటింగ్ పార్ట్ అంతా ఆ సెట్‌లోనే జరగనుంది. మూవీ కోసం పవన్ 20 రోజులు మాత్రమే డేట్స్ ఇచ్చినట్టు సమాచారం. మరోవైపు సినిమా రిలీజ్ డేట్‌ కూడా మూవీ టీం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. సమ్మర్ గిప్ట్‌గా మే 23న ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నట్టు ఫిలిం వర్గాల్లో చర్చ సాగుతోంది.

Pawan Kalyan's getup in Pink remake leaked, ‘పింక్’ రీమేక్‌లో పవన్ లుక్..రచ్చ చేస్తోన్న లీక్డ్ పిక్స్

Related Tags