‘గబ్బర్‌సింగ్’ సినిమా హిట్‌ కంటే.. ఈ కిక్ బావుంది..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పుస్తకాలు అన్నా, వ్యవసాయమన్నా అమితమైన ఇష్టం. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. వెంటే పుస్తకాలు కూడా తీసుకెళతానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంతే కాదు.. ఎన్నికల్లో ప్రసంగించేటప్పుడు కూడా.. ఏదో ఒక పుస్తకం గురించి చెబుతూంటారు. అలాగే.. ఆయనకు కాస్త ఖాళీ దొరికిగా.. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. కానీ.. ఓ పుస్తకం మాత్రం ‘గబ్బర్‌సింగ్’ సినిమా హిట్ కంటే.. మంచి కిక్‌ ఇచ్చిందని.. తెలిపారు. పవన్ తాజాగా.. హైదరాబాద్‌ ఫిల్మ్ […]

  • Tv9 Telugu
  • Publish Date - 9:13 am, Wed, 14 August 19
'గబ్బర్‌సింగ్' సినిమా హిట్‌ కంటే.. ఈ కిక్ బావుంది..!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు పుస్తకాలు అన్నా, వ్యవసాయమన్నా అమితమైన ఇష్టం. ఆయన ఎప్పుడు ఎక్కడికి వెళ్లినా.. వెంటే పుస్తకాలు కూడా తీసుకెళతానని ఎన్నో సందర్భాల్లో చెప్పారు. అంతే కాదు.. ఎన్నికల్లో ప్రసంగించేటప్పుడు కూడా.. ఏదో ఒక పుస్తకం గురించి చెబుతూంటారు. అలాగే.. ఆయనకు కాస్త ఖాళీ దొరికిగా.. ఎప్పుడూ పుస్తకాలు చదువుతూ కనిపిస్తారు. కానీ.. ఓ పుస్తకం మాత్రం ‘గబ్బర్‌సింగ్’ సినిమా హిట్ కంటే.. మంచి కిక్‌ ఇచ్చిందని.. తెలిపారు.

పవన్ తాజాగా.. హైదరాబాద్‌ ఫిల్మ్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ రచయిత, రాజకీయ విశ్లేషకుడు తెలకపల్లి రవి రాసిని ‘మన సినిమాలు’ పుస్తకాన్ని పవన్ కళ్యాణ్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖులు పరుచూరి గోపాలకృష్ణ, తనికెళ్ళ భరణి, సుద్దాల అశోక్ తేజ పలువురు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పవన్ మాట్లాడుతూ.. నాకు ఈ పుస్తకం ‘గబ్బర్‌సింగ్’ సినిమా హిట్ కంటే.. మంచి కిక్‌ ఇచ్చిందని.. తెలిపారు. కాగా.. అలాగే.. ఓ సందర్భంగా తనికెళ్ళ భరణి ఇచ్చిన ‘వనవాసి’ పుస్తకం కూడా నన్ను బాగా ఆకట్టుకుందని.. దాంతోనే నేను పర్యావరణంపై మక్కువ పెంచుకున్నట్లు తెలిపారు. ఇలాంటి మంచి రచయితలు పుస్తకాలు రాస్తానే.. భావితరాలకు విలువలేంటో తెలుస్తాయని పేర్కొన్నారు నటుడు పవన్ కళ్యాణ్.

Pawan Kalyan launches Telakapalli Ravis Mana Cinemalu Book