Breaking News
  • భారత్‌లో కరోనా వైరస్ స్వైరవిహారం చేస్తోంది. రోజురోజుకూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు నమోదవుతుండటం ప్రజలను ఆందోళన కలిగిస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో అత్యధికంగా 28,637 కరోనా కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తాజాగా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది.
  • అమరావతి మండలం ముత్తాయపాలెం బ్యాంక్ ని మోసం చేసిన కేసులో ఉన్నతాధికారులు సీరియస్. బ్యాంకుకు తనఖా పెట్టిన భూమిని ఏవిధంగా ప్రభుత్వానికి విక్రయించారంటూ ఆరా తీస్తున్న అధికారులు. ఇప్పటికే ప్రారంభమయిన పోలీసు దర్యాప్తు.
  • విజయవాడ: ఆత్రేయపురం ప్రేమకథ సినిమా పేరుతో మోసం. చైతన్య క్రియేషన్ బ్యానర్ పై సినిమా అంటూ యువతులకు వల. అమరావతి శివక్షేత్రంలో సినిమా ప్రారంభం అంటూ రిబ్బన్ కటింగ్ చేసిన గుంటూరు జిల్లాకు చెందిన రెంవత్ బిక్షా . విజయవాడ, గుంటూరు జిల్లాకు చెందిన యువతులను హీరోయిన్లుగా చేస్తానంటూ చీటింగ్.
  • తిరుపతి.... డయిల్ యువర్ ఈఓ కార్యక్రమంలో టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్.... శ్రీవారికి భక్తులు కానుకగా ఇచ్చే ప్రతి రూపాయి సద్వినియోగం చేసుకుంటాం. నిధులు దుర్వినియోగం కానీయం. నెలరోజుల్లో 16.73 కోట్లు శ్రీవారికి హుండీ ద్వారా ఆదాయం లభించింది.
  • ఆత్రేయపురం ప్రేమకథ దర్శకుడు దేవరాయ రమేష్ అలియాస్ రవితేజ అలియాస్ రావణ్ బిక్షూ. నేను ఎవరి దగ్గర డబ్బులు తీసుకోలేదు. డబ్బులు తీసుకున్నట్లు నిరూపించాలి. ఆధారాలు టివి9 కే అందించాలి. ఎటువంటి కేసులు ఎదుర్కోవటానికైనా సిద్దంగా ఉన్నా. నా దగ్గర స్ర్కిప్టు తీసుకెళ్ళిన కో డైరెక్టర్ భార్గవి నాపైనే ఆరోపణలు చేస్తోంది. హీరో, ఇతర ఆర్టిస్ట్ లతో ఫోన్ లో మాట్లాడిన రావణ్ భిక్షూ.
  • హైదరాబాద్ లో మాయమైన సండే సందడి. చాలా ఏరియా లలో కనిపిస్తున్న కర్ఫ్యూ వాతావరణం . షాపులు...మాల్స్ ..రెస్టారెంట్లు..తెరిచి ఉన్నా కన్పిపించని పబ్లిక్. ఆదివారం మార్కెట్ లలో సైతం అనంతం మాత్రం గానే కొనుగోలుదారు. కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్న కరోనా భయం. ఇళ్లకే పరిమితం అవుతున్న జనం. హైదరాబాద్ లో పెరుగుతున్న అధిక కేసులతో ... అలర్ట్ అయిన పబ్లిక్.
  • నగరంలో మరొకసారి ఆక్సిజన్ సిలిండర్ల పట్టివేత. ముషీరాబాద్ లో 34 సిలెండర్లని ఆక్సిజన్ సిలిండర్ ను సీజ్ చేసిన అధికారులు. అనుమతులు లేకుండా సిలిండర్ విక్రయిస్తున్న బాబా ట్రేడర్స్. అధిక ధరకు సిలిండర్లను అమ్ముతున్న సర్దార్ ఖాన్ ను అరెస్టు చేసిన నార్త్ జోన్ టాస్క్ ఫోర్స్ అధికారులు.

సాయితేజ్ కోసం.. పవర్ స్టార్

'చిత్రలహరి', 'ప్రతీ రోజూ పండగే' సినిమాలతో హిట్లు కొట్టిన మెగాహీరో సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం 'సోలో బ్రతుకే సో బెటర్'లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దానితో పాటు ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్..
Pawan Kalyan Launch Sai Dharam Tej New movie, సాయితేజ్ కోసం.. పవర్ స్టార్

‘చిత్రలహరి’, ‘ప్రతీ రోజూ పండగే’ సినిమాలతో హిట్లు కొట్టిన మెగాహీరో సాయిధరమ్ తేజ్.. ప్రస్తుతం ‘సోలో బ్రతుకే సో బెటర్’లో నటిస్తూ బిజీగా ఉన్నాడు. దానితో పాటు ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. తాజాగా హైదరాబాద్‌లో గురువారం ఈ చిత్రం పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా హాజరై మొదటి క్లాప్‌ని కొట్టారు. అలాగే.. బీవీఎస్ఎన్ ప్రసాద్, అల్లు అరవింద్, వంశీ పైడిపల్లి హాజరయ్యారు.

కాగా ఈ సినిమాకి ‘ప్రస్థానం’ సినిమాతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న డైరెక్టర్ దేవర కట్టా.. దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ఇంటెన్స్ పొలిటికల్ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతుందట. సాయితేజ్ సరసన నివేదా పేతురాజ్ హీరోయిన్‌గా నటిస్తోంది. అలాగే.. జగపతిబాబు, రమ్యకృష్ణ కీలక పాత్రలు పోషించనున్నారు. మణిశర్మ సంగీతం అందిస్తుండగా.. జేబీ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై భగవాన్, పుల్లారావు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే ప్రకటించనున్నట్లు డైరెక్టర్ దేవర కట్టా తెలిపారు.

Read More this also: వైసీపీ ఆవిర్భావ రోజు.. వైఎస్ జగన్ భావోద్వేగ ట్వీట్

మహిళా సీఐపై చేయి చేసుకున్న వైసీపీ నేత..

హీరో, హీరోయిన్‌కు కరోనా.. షాక్‌లో సినీ ఇండస్ట్రీ

మరో 10 రోజుల్లో భారీగా తగ్గనున్న పెట్రోల్ ధరలు.. తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

ఎస్‌బీఐ ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. మినిమమ్ బ్యాలెన్స్ రూల్ తొలగింపు

బ్రేకింగ్: ఇటలీలో చిక్కుకున్న విద్యార్థులకు విముక్తి.. కేంద్రం ప్రత్యేక సాయం

Related Tags