జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చ, పవన్‌ కళ్యాణ్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడికెక్కిన ఏపీ రాజకీయం

జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చకు తెరలేచింది. పవన్‌ వ్యాఖ్యలతో రాజకీయ చర్చంతా జమీలీ మీదకే వెళ్లింది. పవన్‌కళ్యాణ్‌కి ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఎం నేత మధు. జమిలి ఎలక్షన్స్‌ ప్రభావం ఏంటో తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే పవన్‌ వ్యాఖ్యల్ని సమర్థించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగానే జనసేన అధినేత పవన్‌ ఆ […]

  • Venkata Narayana
  • Publish Date - 8:32 am, Fri, 20 November 20

జమిలీ ఎన్నికలపై ఏపీలో రసవత్తర చర్చకు తెరలేచింది. పవన్‌ వ్యాఖ్యలతో రాజకీయ చర్చంతా జమీలీ మీదకే వెళ్లింది. పవన్‌కళ్యాణ్‌కి ఆ సమాచారం ఎవరిచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు సీపీఎం నేత మధు. జమిలి ఎలక్షన్స్‌ ప్రభావం ఏంటో తెలియకుండా పవన్‌ మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. అయితే పవన్‌ వ్యాఖ్యల్ని సమర్థించారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. జమిలీ ఎన్నికలపై దేశవ్యాప్తంగా చర్చ జరగాలని ప్రధాని మోదీ ఇచ్చిన పిలుపులో భాగంగానే జనసేన అధినేత పవన్‌ ఆ వ్యాఖ్యలు చేశారని తెలిపారు. జమిలీ ఎన్నికలపై రాష్ట్ర ప్రజల్లోనూ విస్తృతంగా చర్చ జరుగుతోందని అన్నారు.  జమిలి ఎన్నికలపై పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు… ఏపీ అసెంబ్లీకి ముందస్తు రావచ్చన్న జనసేనాని