Breaking News
  • 'మా' అసోసియేషన్‌లో ముసలం. నిన్నటి నుంచి తెరుచుకోని ఆఫీస్‌ తలుపులు. అధ్యక్ష, కార్యదర్శుల మధ్య విభేదాలతో ఆఫీస్‌కు రాని సిబ్బంది. మాట్లాడేందుకు నిరాకరించిన కార్యవర్గ సభ్యులు.
  • బిల్లులపై చర్చ జరగకుండానే ఏపీ మండలి వాయిదా పడే అవకాశం. బిల్లుపై చర్చకు ఒప్పించేందుకు వైసీపీ సభ్యుల ప్రయత్నాలు. అంగీకరించని విపక్ష సభ్యులు. రూల్‌ 71పై చర్చ జరగాలని పట్టుబట్టిన విపక్ష సభ్యులు.
  • హైదరాబాద్‌: ధరమ్‌ కరం రోడ్‌లో పిచ్చికుక్కల స్వైరవిహారం. 10 మంది చిన్నారులకు తీవ్రగాయాలు, ఆస్పత్రికి తరలింపు.
  • తిరుమల: రథసప్తమి సందర్భంగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. రథసప్తమి సందర్భంగా శ్రీవారి ఆలయంలో ఆర్జిత సేవలు రద్దు. మాడ వీధుల్లో షెడ్లు ఏర్పాటు-టీటీడీ అడిషనల్ ఈవో ధర్మారెడ్డి.
  • హైదరాబాద్‌: రాష్ట్రంలో రాజకీయాలను డబ్బు శాసిస్తోంది. రాజ్యాధికారం సాధిస్తేనే విద్య, ఉద్యోగాలు వస్తాయి-లక్ష్మణ్‌. డబ్బుతో రాజకీయాలు నడపడం అప్రజాస్వామికం. దళితుల హక్కుల కోసం చేసే పోరాటంలో బీజేపీ ముందుంటుంది -తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్‌.

రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్…కాదనలేకపోయిన పవన్

Pawan Kalyan yet to accept Pink remake even after getting Rs 50 crore as remuneration, రూ. 50 కోట్ల రెమ్యూనరేషన్…కాదనలేకపోయిన పవన్

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు పవన్ యమ బిజీగా ఉన్నారు. అధికార వైసీపీ నేతలపై, సీఎం జగన్‌పై తీవ్ర స్థాయిలో విమర్శనాస్త్రాలు సంధిస్తున్నారు. అయితే ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వబోతున్నారన్న విషయం ఇటీవల ‘దిల్ రాజు’ ఇచ్చిన స్టేట్మెంట్‌తో క్లియరైపోయింది. ‘పింక్’ రీమేక్‌తో తిరిగి తెరంగ్రేట్రం చేయబోతున్నాడు పవన్.   అయితే ఈ మూవీకి  పవన్ 50 కోట్ల రూపాయల పారితోషికం తీసుకుంటున్నారన్న టాక్ ఫిలిం సర్కిల్‌లో జోరందుకుంటుంది.

ఈ సినిమాకు గాను మొత్తం 70  కోట్ల బడ్జెట్‌ను నిర్మాత దిల్ రాజు పక్కన పెట్టేశాడట. అందులో 50 కోట్లు పవన్ తీసుకుంటుండగా, మిగిలిన 20 కోట్లతో సినిమాని కంప్లీట్ చెయ్యనున్నారని టాక్. పవన్ సినిమా అంటే ఆ బజ్ మాములుగా ఉండదు. ఇక రీ ఎంట్రీ అంటే ఫ్యాన్స్‌కు పూనకాలే. ప్రజంట్ జరుగుతోన్న బిజినెస్‌ను బట్టి చూస్తే..యావరేజ్ టాక్ వచ్చినా పవన్ మూవీ ఈజీగా 100 కోట్లు వసూలు చేస్తుంది.

మూవీలో మెయిన్ లీడ్స్ కోసం నివేధా థామస్, అంజలి, అనన్య లను ఇప్పటికే కన్ఫామ్ చేసినట్లు తెలుస్తోంది. హిందీలో అమితాబ్ నటించిన ‘పింక్’ సంచలన విజయాన్ని నమోదు చేసింది.  తమిళ్‌లో అజిత్‌తో రీమేక్ చెయ్యగా..అక్కడ కూడా విజయదు:దుభి మోగించింది. మంచి మెసేజ్ ఉన్న మూవీ కావడంతో పవన్ కూడా ఈ రీమేక్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ‘ఓ మై ప్రెండ్’, ‘ఎమ్‌సీఏ’ చిత్రాలను డైరెక్ట్ చేసిన వేణు శ్రీరాం ఈ మూవీకి దర్శకుడు.  తమన్ మ్యూజిక్ అందిస్తోన్న ఈ రీమేక్‌కు ‘లాయర్ సాబ్‌’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.