ప్రజలను పరామర్శించేందుకు వెళ్లాల్సిందే: పవన్ కళ్యాణ్

రాజధాని పర్యటన వాయిదా వేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసు వద్దే పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ధర్మ పోరాటం చేస్తున్న మహిళలు, రైతుల పై లాఠీఛార్జి చేయడం అన్యాయం అని పవన్ తెలిపారు. ప్రజలను పరామర్శించేందుకు వెళ్లాల్సిందేనని, దెబ్బలతో గాయపడిన వారిని పలకరిస్తానన్న పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. 144, 30 సెక్షన్ లు అమల్లో ఉన్నందున నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు. రైతులు న్యాయ పోరాటం చేస్తున్న […]

ప్రజలను పరామర్శించేందుకు వెళ్లాల్సిందే: పవన్ కళ్యాణ్
Follow us

| Edited By:

Updated on: Jan 20, 2020 | 10:37 PM

రాజధాని పర్యటన వాయిదా వేసుకోవాలని పవన్ కళ్యాణ్ కు పోలీసులు విజ్ఞప్తి చేశారు. మంగళగిరి పార్టీ ఆఫీసు వద్దే పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. ధర్మ పోరాటం చేస్తున్న మహిళలు, రైతుల పై లాఠీఛార్జి చేయడం అన్యాయం అని పవన్ తెలిపారు. ప్రజలను పరామర్శించేందుకు వెళ్లాల్సిందేనని, దెబ్బలతో గాయపడిన వారిని పలకరిస్తానన్న పవన్ ను పోలీసులు అడ్డుకున్నారు. 144, 30 సెక్షన్ లు అమల్లో ఉన్నందున నోటీసులు ఇస్తామని పోలీసులు తెలిపారు.

రైతులు న్యాయ పోరాటం చేస్తున్న రైతులపై రాష్ట్ర ప్రభుత్వం అనాగరికంగా వ్యవహరించిందని పవన్ అన్నారు. పోలీసులు అమానుషంగా లాఠీఛార్జి చేశారని,  మా‌ పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని తెలిపారు.  నేను ఎందుకు‌వెళ్ల కూడదో‌ చెప్పండి, మేము ఈరోజే వెళ్లి పరామర్శిస్తాం, మా పర్యటనను అడ్డుకుని‌ వివాదం చేయవద్దని పవన్ స్పష్టంచేశారు.

వైసీపీ ప్రభుత్వానికి విశాఖపై ప్రేమలేదని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే విశాఖ రాజధాని అంటున్నారని ఆయన తెలిపారు. టీడీపీ చేసిన తప్పులే వైసీపీ చేస్తోందన్నారు. అమరావతిని తరలించడం సాధ్యంకాదని చెప్పారు. 5 కోట్ల మంది ఆమోదించిన తర్వాత ఇప్పుడు రాజధాని తరలింపు ఏంటి? అని పవన్ ప్రశ్నించారు. ప్రశాంతమైన విశాఖలో ఫ్యాక్షన్‌ పడగలు విప్పేలా చేస్తున్నారని పేర్కొన్నారు. ‘‘మా పార్టీ కార్యాలయం నుంచి బయటికి రానివ్వకపోవడం దారుణం. రాజధాని తరలింపు నిర్ణయం తాత్కాలికమే. రాజధాని మార్పుతో జగన్‌ తన వినాశనాన్ని కొని తెచ్చుకున్నాడు. ఏపీలో పరిణామాలను కేంద్రం దృష్టికి తీసుకెళ్తామని పవన్ వివరించారు.

రాజధాని మార్చటానికి ఎన్ని బిల్స్ పెట్టుకున్నా రాజధాని మార్పు తాత్కాలికమేనని, పచ్చని పొలాలను రైతుల రాజధాని కోసం ఇచ్చి, అంచెల అంచెలుగా రాజధాని కట్టాలని టీడీపీ ని గతం లో కోరారు అని తెలిపారు పవన్ కళ్యాణ్. కాగా.. వైసీపీ రైతులను మోసం చేసిందని, అధికార వికేంద్రీకరణ అని జగన్ కథలు చెప్తున్నాడని అన్నారు పవన్. ప్రతి పక్షం లో ఉన్నపుడు జగన్ రాజధాని ని ఎందుకు సపోర్ట్ చేసాడు? మూడు రాజధానులు అంశం రాజకీయం కోసమే, మూడు రాజధానులు వల్ల ఉద్యోగాలు వస్తాయా? అని పవన్ ఆరోపించారు. ప్రధాని మోడీ శంకుస్థాపన చేశారు కాబట్టి రాజధాని ఇక్కడే ఉంటుంది. రైతులు ఏమన్నా ఉగ్రవాదులా? 151 సీట్లు వైసీపీ ఇస్తే జిల్లాల మధ్య గొడవలు పెడుతున్నారని జగన్ ప్రభుత్వాన్ని తీవ్రంగా దుయ్యబట్టారు పవన్. ఒక్క రాజధానికి దిక్కు లేదు.. మూడు కావాలా?? బ్రిటీష్ వాళ్ళు పాలించినట్టు పాలిస్తున్నారు…ఆ రక్తం ఇంకా పోయినట్టు లేదు…ముక్కలు ముక్కలుగా రాష్టాన్ని విభజించు పాలించు అనేట్టుగా చేస్తున్నారు అని వాపోయారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్.

4 వేలు ఎకరాలు నిజంగా ట్రేడింగ్ జరిగి ఉంటే వాళ్ళని లోపల వేయండి, అమరావతి రైతులకు అండగా ఉంటాం. సచివాలయం విశాఖకి తరలింపు చేస్తున్నారు.. అక్కడి స్థానికులకు ఉద్యోగాలు ఇస్తారా? పాలిటిక్స్ నాకు నేషనల్ సీర్వీస్ లాంటిది, నిస్వార్థంగా నా వంతు కృషి చేస్తా, ప్రతిదాన్ని రాజకీయం చేయను అని జనసేనాని తెలిపారు. బీజేపీ జనసేన కలయిక వైసీపీ కి అడ్డుకట్ట వేయటానికేనని, వైసీపీ లాంటి విభజించి పాలించు పార్టీ ని ఆపాలంటే టీడీపీ కి సత్తా సరిపోవడం లేదని వివరించారు పవన్.