సైరా.. సై..సై.. అంటాడా..?

Pawan Kalyan Voice To Sye Raa Narasimha Reddy, సైరా.. సై..సై.. అంటాడా..?

సైరా నరసింహారెడ్డి సినిమాకి అభిమానులే కాదు.. తమ్ముడూ జై కొట్టాడు. మొన్న టీజర్ కి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.. నిన్న బర్త్ డే వేడుకల్లో పాల్గొన్నాడు. ఇక ఈ అన్నదమ్ముల అనుబంధం సిల్వర్ స్క్రీన్ వరకేనా.. పొలిటికల్ స్క్రీన్ మీద కూడా కనిపిస్తుందా? తమ్ముడి కోసం అన్నయ్య రాజకీయాల్లోకి రీ ఎంట్రీ ఇస్తారా..? అనేది ఇప్పుడు చర్చగా మారింది.

అన్నయ్య బర్త్ డే వేడుకలకి స్పెషల్ గెస్ట్ గా వచ్చిన పవన్ అన్నయ్యే తనకు ఆదర్శమని ప్రకటించాడు.. దాంతో ఈ అన్నదమ్ముల బంధం పొలిటికల్ సర్కిల్స్ లో కొత్త డిస్కషన్ కి తెర లేపింది. మునుపెన్నడూ రాజకీయ వేదికను పంచుకోని అన్నదమ్ములు ఇప్పడు సినీ వేదికను పంచుకోవడంతో ఈ బంధం రాజకీయ వేదికను కూడా పంచుకుంటుందా? అనే చర్చలు మొదలయ్యాయి.

పవన్ కళ్యాణ్ జనసేన స్థాపించిన తర్వాత అన్నదమ్ములు రాజకీయ వేదికపైన ఎప్పుడూ కనిపంచలేదు. చిన్న అన్నయ్య నాగబాబు తమ్ముడికి సపోర్ట్ గా నిలవడమే కాకుండా ఎంపీగా కూడా పోటీ చేశారు. కానీ చిరంజీవి మాత్రం తమ్ముళ్లకు మద్దతు కూడా ప్రకటించలేదు. తర్వాత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలైన పవన్ రాజకీయానికి గుడ్ బై చెప్పేస్తారనుకున్నారంతా..

అయితే వారి ఆలోచనలను పటాపంచలు చేస్తూ మరో పదేళ్ళు ఫుల్ టైమ్ పాలిటిక్సే అంటూ క్లారిటీ ఇచ్చారు పవన్ కళ్యాణ్. తాజాగా పెద్దన్నయ్య పుట్టిన రోజు వేడుకల్లో పాలుపంచుకున్న పవన్ అన్నయ్యే నాకు ఆదర్శమని చెప్పడం కొత్త చర్చలకు దారి తీసింది. సినిమా కోసం కలిసిన అన్నదమ్ముల ప్రేమ రాజకీయాల్లోనూ కనిపిస్తుందా అనే చర్చలు జనసేన వర్గాల్లో జోరుగా సాగుతున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *