తీరనున్న అభిమానుల కోరిక.. ఒకే ఫ్రేమ్‌లో పవన్, మహేష్..!

Pawan Kalyan and Mahesh Babu on one stage for event, తీరనున్న అభిమానుల కోరిక.. ఒకే ఫ్రేమ్‌లో పవన్, మహేష్..!

టాలీవుడ్‌ టాప్ హీరోలు పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, సూపర్‌స్టార్ మహేష్‌ బాబులకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ ఇద్దరికి అన్ని వర్గాల్లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఇక వీరిద్దరిని ఒకే ఫ్రేమ్‌లో చూడాలని ఎప్పటినుంచో ఇరు హీరోల అభిమానులు అనుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం వారి కోరిక త్వరలోనే నెరవేరనున్నట్లు తెలుస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. తెలుగు సినీ ప్రొడక్షన్ ఎగ్జిగ్యూటివ్స్ యూనియన్ 25సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఓ ఈవెంట్‌ను నిర్వహించబోతుంది. సెప్టెంబర్ 8న జరగబోయే ఈ కార్యక్రమానికి పవన్, మహేష్ ఇద్దరూ రాబోతున్నారట. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానున్నట్లు సమాచారం. ఒకవేళ ఇదే నిజమైతే ఇరు స్టార్ల అభిమానులతో పాటు టాలీవుడ్ ప్రేక్షకులకు పండగే.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *