పవన్- హరీష్‌ మూవీ ఎలా ఉండబోతుందంటే..!

పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్ కాంబినేషన్లో రెండో చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే

పవన్- హరీష్‌ మూవీ ఎలా ఉండబోతుందంటే..!
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Apr 03, 2020 | 3:34 PM

పవన్‌ కల్యాణ్‌- హరీష్‌ శంకర్ కాంబినేషన్లో రెండో చిత్రం తెరకెక్కబోతున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌పై అటు ఫ్యాన్స్‌తో పాటు ఇటు సాధారణ ప్రేక్షకుల్లోనూ అంచనాలు పెరిగిపోయాయి. ఇదివరకు పవన్-హరీష్‌ కాంబోలో తెరకెక్కిన గబ్బర్‌సింగ్ సూపర్‌ హిట్ అవ్వడంతో.. ఇప్పుడు రాబోతున్న చిత్రంపై ఫ్యాన్స్ అంతకుమించిన ఆశలను పెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో ఆ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా హరీష్‌ జాగ్రత్తలు తీసుకుంటున్నారట.

ఇక సినీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీలో గబ్బర్‌ సింగ్ ఛాయలు ఎక్కువగా కనిపించనున్నాయట. అంతేకాదు ఈ సినిమాలో పొలిటికల్ ఫ్లేవర్‌ కూడా ఉండనుందట. నిజ జీవితంలో పవన్‌ పొలిటికల్ క్రేజ్‌కు మరింత పెంచేలా హరీష్‌ డైలాగ్‌లు రాసినట్లు తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఫ్యాన్స్‌కు ఈ సినిమాతో మంచి ట్రీట్‌ ఇవ్వబోతున్నారట హరీష్‌. మరి ఇందులో నిజమెంత..? పవన్-హరీష్‌ సినిమా ఏ బ్యాక్‌డ్రాప్‌తో తెరకెక్కబోతోంది..? ఇందులో ఎవరెవరు నటించబోతున్నారు…? అన్న ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే.

Read This Story Also: కరోనాపై పోరుకు.. ‘ఆరోగ్య సేతు’ ట్రాకింగ్ యాప్.. ఎలా పని చేస్తుందంటే.?