‘ఆ’ విషయంలో జగన్, పవన్ క్వైట్ అపోజిట్.. ఎందులో తెలుసా ?

రాజకీయాల్లో వున్న ఇద్దరు పెద్ద వ్యక్తులను పరస్పరం పోల్చి చూడడం సహజంగా జరిగే పనే. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య సమీప్యతలు, భిన్నమైన అంశాలను మీడియా తరచూ ప్రస్తావించేది. ముఖ్యమంత్రులుగా ఎవరి స్టైల్ ఏంటి అనే విషయంలో తరచూ చర్చ జరిగేది. తాజాగా ఆల్ మోస్ట్ సమాన వయస్కులైన వైసీపీ అధినేత, సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లను తరచూ పోల్చుకుంటూనే వుంటారు. ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు క్వైట్ అపోజిట్ […]

'ఆ' విషయంలో జగన్, పవన్ క్వైట్ అపోజిట్.. ఎందులో తెలుసా ?
Follow us

|

Updated on: Nov 13, 2019 | 6:23 PM

రాజకీయాల్లో వున్న ఇద్దరు పెద్ద వ్యక్తులను పరస్పరం పోల్చి చూడడం సహజంగా జరిగే పనే. గతంలో చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల మధ్య సమీప్యతలు, భిన్నమైన అంశాలను మీడియా తరచూ ప్రస్తావించేది. ముఖ్యమంత్రులుగా ఎవరి స్టైల్ ఏంటి అనే విషయంలో తరచూ చర్చ జరిగేది. తాజాగా ఆల్ మోస్ట్ సమాన వయస్కులైన వైసీపీ అధినేత, సీఎం జగన్, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్‌లను తరచూ పోల్చుకుంటూనే వుంటారు. ఒక్క విషయంలో మాత్రం ఇద్దరు క్వైట్ అపోజిట్ అని బుధవారం నిరూపణ అయ్యింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకునే పిల్లలకు తప్పనిసరిగా ఇంగ్లీషు భాషలోనే విద్యాబోధన జరగాలని సీఎం జగన్ సంకల్పించిన సంగతి తెలిసిందే. జాతీయ స్థాయిలో మెరుగైన ఫలితాలు సాధించాలంటే ఇంగ్లీషు మీడియంలో విద్య తప్పనిసరి అని ముఖ్యమంత్రి భావించడమే ఈ సంకల్పానికి కారణమని తెలుస్తోంది. అయితే తెలుగు భాషను చంపేస్తున్నారంటూ రాజకీయ నాయకులు గగ్గోలు పెట్టడం కావచ్చు.. లేక ప్రభుత్వ పాఠశాలల్లో తగిన స్థాయిలో సంసిద్దత లేకపోవడం కావచ్చు.. ఒకటి నుంచి పదో తరగతి వరకు ఇంగ్లీష్ మీడియంను కంపల్సరీ చేయాలన్న యోచనను జగన్ తాత్కాలికంగా పక్కన పెట్టేశారు. ఒకటి నుంచి ఆరో తరగతి వరకు ఇంగ్లీషు మీడియంను మాత్రం అర్జెంట్ ఆమోదించేశారు.

ఇదంతా జగన్ స్టైల్‌కు సంబంధించిన సమాచారం. ఇదే సమయంలో తెలుగు, ఇంగ్లీషు మీడియంపై జనసేన ఓ ప్రెస్ రిలీజ్ విడుదల చేసింది. ఈ ప్రెస్ నోట్ చూసిన వారెవరికైనా జగన్‌కు పూర్తి భిన్నంగా జనసేనాని వెళుతున్నట్లు క్లియర్‌గా అర్థమవుతోంది. ఒకటవ తరగతి నుంచి ఇంగ్లీషు విద్య అని జగన్ అంటుంటే.. కెజి నుంచి పిజి వరకు తెలుగు మీడియంలోనే విద్యాబోధన జరపడమే జనసేన విధానమని ప్రెస్ నోట్‌లో పేర్కొన్నారు. ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు తెలుగు మాధ్యమంలోనూ చదువుకునే వెసులుబాటు ఇవ్వటమే జనసేన పార్టీ విధానం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ బావిస్తున్నారని పేర్కొన్నారు.

తెలుగు మాధ్యమం పూర్తిగా తొలగించడం పద్ధతి కాదు… ఆ మాధ్యమాన్ని కొనసాగిస్తూ, ఆ మాధ్యమంలో చదువుకొనే వారికి ప్రోత్సాహం ఇచ్చేలా తదుపరి ఎన్నికల ప్రణాళికను రూపొందిస్తామని తెలిపారు. బుధవారం విజయవాడలో పవన్ కళ్యాణ్‌ని ఆయన నివాసంలో తెలుగు భాషోద్యమ సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సామల రమేష్ బాబు కలిశారు. ఆంగ్ల మాధ్యమం ప్రవేశపెట్టే దిశగా వైసిపి ప్రభుత్వం అడుగులు వేస్తున్న క్రమంలో మాతృ భాషను కాపాడేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

ఈ సందర్భంగా “ఎల్.కె.జి. నుంచి పీజీ వరకు మాతృ భాషలో బోధన ఎలా అనే అంశంపై పెద్దలతో చర్చించి నిర్ణయం తీసుకుంటాం. జనసేన ప్రభుత్వం వచ్చాక కేజీ నుంచి పీజీ వరకూ తెలుగు మాధ్యమంలో చదివే వారికి రుసుములు ప్రభుత్వమే చెల్లించే విధానం తెస్తాం.’’ అని పవన్ కల్యాణ్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.