కన్నీటిని ఆపలేకపోతున్నాం.. వలస కార్మికుల వెతలపై మద్రాస్ హైకోర్టు

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు కాలినడకన వందలాది కిలోమీటర్ల దూరం వెళ్తున్న వలస కూలీల కష్టాలపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారంటూ కేంద్రాన్ని, తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 22 లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. ఈ లక్షలాది వలస కార్మికుల వెతలు మీకు పట్టటం లేదా.. వారి భద్రత, సంక్షేమం గురించి ఏ మాత్రం ఆలోచించరా అని కేంద్రాన్ని, తమిళనాడు సర్కార్ ని ఘాటుగా విమర్శిస్తూ.. […]

కన్నీటిని ఆపలేకపోతున్నాం.. వలస కార్మికుల వెతలపై మద్రాస్ హైకోర్టు
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: May 16, 2020 | 6:29 PM

కరోనా వైరస్ లాక్ డౌన్ నేపథ్యంలో తమ స్వస్థలాలకు కాలినడకన వందలాది కిలోమీటర్ల దూరం వెళ్తున్న వలస కూలీల కష్టాలపై మద్రాస్ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. ఈ సంక్షోభాన్ని ఎలా పరిష్కరిస్తారంటూ కేంద్రాన్ని, తమిళనాడు ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ నెల 22 లోగా సమాధానమివ్వాలని ఆదేశించింది. ఈ లక్షలాది వలస కార్మికుల వెతలు మీకు పట్టటం లేదా.. వారి భద్రత, సంక్షేమం గురించి ఏ మాత్రం ఆలోచించరా అని కేంద్రాన్ని, తమిళనాడు సర్కార్ ని ఘాటుగా విమర్శిస్తూ.. ఈ క్రైసిస్ పై రాష్ట్రాల వారీ డేటా ఇవ్వాలని ముఖ్యంగా కేంద్రానికి సూచించింది. వీరంతా రోజుల తరబడి పిల్లలతో నానా కష్టాలు పడుతూ వెళ్తున్నారని న్యాయమూర్తులు ఎన్.కృపాకరన్, ఆర్. హేమలత వ్యాఖ్యానించారు. ఈ వలస జీవుల్లో కొందరు నడవలేక మధ్యదారిలోనే చనిపోతున్నారని, మరికొందరు రోడ్డు ప్రమాదాల్లో మరణిస్తున్నారని న్యాయమూర్తులు పేర్కొన్నారు. ఇది హ్యూమన్ ట్రాజెడీ అని అభివర్ణించారు. తమిళనాడుకు చెందిన వందలాది వలస కార్మికులు ఇంకా మహారాష్ట్ర లోనే చిక్కుబడి ఉన్నారని, వారి గతి గురించి పట్టించుకోవాలని కోరుతూ కొంతమంది దాఖలు చేసిన పిటిషన్ పై కోర్టు తనంతట తానుగా స్పందించి ఈ వ్యాఖ్యలు చేసింది.