డ్రోన్ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలు వదులుతున్న పాక్..‌!

దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు ఉగ్రవాదులను దేశంలోకి ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు డ్రోన్లతో భారత్‌లో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో డ్రోన్లు సంచరిస్తుండటంతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని భారత వైమానిక స్థావరాలపై దాడులకు పాక్ కుయుక్తులు పన్నుతుందని నిఘా వర్గాలు హెచ్చిరికలు […]

డ్రోన్ల ద్వారా భారత్‌లోకి ఆయుధాలు వదులుతున్న పాక్..‌!
Follow us

| Edited By:

Updated on: Oct 12, 2019 | 9:52 PM

దేశంలో అలజడి సృష్టించేందుకు పాకిస్థాన్ విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు ఉగ్రవాదులను దేశంలోకి ఉసిగొల్పి.. అలజడి సృష్టించేందుకు ప్రయత్నిస్తూ.. మరో వైపు డ్రోన్లతో భారత్‌లో దాడులు జరిపేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా సరిహద్దుల్లో డ్రోన్లు సంచరిస్తుండటంతో సరిహద్దు భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. డ్రోన్ల ద్వారా సరిహద్దుల్లోని భారత వైమానిక స్థావరాలపై దాడులకు పాక్ కుయుక్తులు పన్నుతుందని నిఘా వర్గాలు హెచ్చిరికలు జారీ చేశాయి.

ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని పఠాన్‌కోట్‌లో పోలీసులు హై అలర్ట్ ప్రకటించారు. పాకిస్థాన్‌కు చెందిన డ్రోన్లు ఈ ప్రాంతంలో సంచరిస్తున్నట్లు గుర్తించారు. డ్రోన్ల ద్వారా భారత భూభాగంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, నకిలీ నోట్లు, మత్తుపదార్థాలను జార విడుస్తుండడంతో ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఈ మేరకు పంజాబ్‌ – హిమాచల్‌ – పాకిస్థాన్‌ సరిహద్దును పంజాబ్‌ పోలీసులు జల్లెడపడుతున్నారు. పంజాబ్‌, పఠాన్‌కోట్‌ల మీదుగానే పాక్‌ డ్రోన్లు సరిహద్దును దాటి దేశంలోకి ప్రవేశించే అవకాశం ఉన్న దృష్ట్యా వాటిని అడ్డుకొనేందుకు గట్టి నిఘా ఉంచారు. సరిహద్దులో అణువణువునూ గాలిస్తున్నారు. జమ్మూ-కశ్మీర్‌లోని ఉగ్రవాదులకు అందజేయడం కోసం పాక్‌ అధికార వర్గాలే ఈ డ్రోన్లను పంపిస్తున్నాయని నిఘా వర్గాలు ఇప్పటికే కేంద్ర హోంశాఖకు నివేదించాయి.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు