జేబీఎస్ బస్‌స్టాప్‌లో పెరుగుతోన్న ప్రయాణికుల రద్దీ

తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లతో ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా.. నగరంలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో...

జేబీఎస్ బస్‌స్టాప్‌లో పెరుగుతోన్న ప్రయాణికుల రద్దీ
Follow us

| Edited By:

Updated on: May 19, 2020 | 12:38 PM

టీఎస్ ప్రభుత్వం తాజాగా ఇచ్చిన వెసులుబాట్లతో తెలంగాణలో ఆర్టీసీ బస్సులు తిరిగి ప్రారంభమయ్యాయి. హైదరాబాద్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్న దృష్ట్యా.. నగరంలో తప్ప మిగతా అన్ని జిల్లాల్లో బస్సులు ఉదయం 6 గంటల నుంచి తిరుగుతున్నాయి. కరోనా వల్ల గత 56 రోజులుగా ఆగిపోయిన బస్సులు.. ఇప్పుడు పరుగులు పెడుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్‌లోని జేబీఎస్ దగ్గర ప్రయాణికుల రద్దీ పెరుగుతోంది. సుమారు 2,500 మంది ప్రయాణికులు ఇప్పటివరకూ జేబీఎస్‌కు చేరుకున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కొన్నారు. అలాగే వారందరికీ కూడా కరోనా స్క్రీనింగ్ నిర్వహించామన్నారు. అధిక శాతం మంది సిద్ధిపేట, కామారెడ్డి, నిజామాబాద్ నుంచి రాకపోకలు కొనసాగిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకూ దాదాపు 10 వేలకు మందికి పైగా ప్రయాణిస్తారని అంచనా వేస్తున్నారు ఆర్టీసీ అధికారులు. అయితే ఇంకా హైదరాబాద్‌లో మాత్రం సిటీ బస్సులకు అనుమతి లేదు. కేవలం ఆటో, టాక్సీలకు మాత్రమే అనుమతి ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం.

ఇది కూడా చదవండి: 

బాంబ్ పేల్చిన శాస్త్రవేత్తలు.. బిగ్గరగా మాట్లాడినా కరోనా..

కేంద్రం బంపర్ ఆఫర్.. ఈజీగా రూ.50 వేలు పొందాలంటే.. ఇలా చేయండి

క్వారంటైన్‌లో ఉన్న యువకుడి ఆత్మహత్య.. కారణం ఇదే!