మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. విమాన, రైలు ప్రయాణికులకు గమనిక.. కొవిడ్ నెగటివ్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి..

కరోనా వికృతరూపానికి తల్లడిల్లిన మహారాష్ట్ర.. రెండో దశ వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి మహారాష్ట్ర వ్యాప్తంగా వైరస్

మహారాష్ట్ర సర్కార్ మరో కీలక నిర్ణయం.. విమాన, రైలు ప్రయాణికులకు గమనిక.. కొవిడ్ నెగటివ్ టెస్ట్ రిపోర్టు తప్పనిసరి..
Follow us

|

Updated on: Nov 23, 2020 | 9:39 PM

కరోనా వికృతరూపానికి తల్లడిల్లిన మహారాష్ట్ర.. రెండో దశ వైరస్ వ్యాప్తితో అప్రమత్తమైంది. ఈ మేరకు మరో కీలక నిర్ణయం తీసుకుంది. తాజాగా మరోసారి మహారాష్ట్ర వ్యాప్తంగా వైరస్ మళ్లీ విజృంభిస్తోంది. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వం మళ్లీ కఠిన ఆంక్షలు విధిస్తోంది. ముఖ్యంగా వివిధ దేశాలు, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే విమాన, రైలు ప్రయాణికులకు కొవిడ్ నెగటివ్ సర్టిఫికెట్‌ను తప్పనిసరి చేసింది. ఢిల్లీ-ఎన్‌సీఆర్, రాజస్థాన్, గుజరాత్, గోవా నుంచి వచ్చే ప్రయాణికులు తప్పనిసరిగా ఆర్‌టీ పీసీఆర్ సర్టిఫికేట్ ఉంటే మహారాష్ట్రలో అనుమతి ఉంటుందని తేల్చి చెప్పింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రే సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. కొవిడ్ నెగటివ్ టెస్టు రిపోర్టును కలిగి ఉండాలని సూచించింది. విమాన ప్రయాణికులైతే ల్యాండింగుకు 72 గంటల ముందు చేయించుకున్నదై ఉండాలని పేర్కొంది. రైలు ప్రయాణికులైతే మహారాష్ట్రలో దిగడానికి 96 గంటల ముందు చేయించుకున్న పరీక్ష రిపోర్టు కలిగి ఉండాలని ప్రభుత్వం పేర్కొంది.