మందు బాటిళ్లతో బతుకమ్మ.. నిజమేంటంటే..?

బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండగ లాంటిది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. భక్తి శ్రద్ధలతో ప్రకృతి ఇచ్చే రంగు రంగు పూలతో అలంకరించి సంబరాలు జరుపుకుంటారు. అలాంటి ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండగ వస్తూందంటే చాలు.. తెలంగాణా పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. ఈ పండుగ తెలంగాణా సాంస్కృతిక ప్రతీకగా జరుపుకుంటారు. అయితే విశిష్టతతో జరుపుకునే ఈ పండుగను […]

మందు బాటిళ్లతో బతుకమ్మ.. నిజమేంటంటే..?
Follow us

| Edited By:

Updated on: Oct 01, 2019 | 12:53 PM

బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచులకు పెద్ద పండగ లాంటిది. బతుకమ్మ పండుగ వచ్చిందంటే చాలు.. భక్తి శ్రద్ధలతో ప్రకృతి ఇచ్చే రంగు రంగు పూలతో అలంకరించి సంబరాలు జరుపుకుంటారు. అలాంటి ఈ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నారు. బతుకమ్మ పండగ వస్తూందంటే చాలు.. తెలంగాణా పల్లెల్లో నూతన ఉత్సాహం వెల్లి విరుస్తుంది. ఈ పండుగ తెలంగాణా సాంస్కృతిక ప్రతీకగా జరుపుకుంటారు. అయితే విశిష్టతతో జరుపుకునే ఈ పండుగను అవమానించారడు ఓ సర్పంచ్. యాదాద్రి భువనగిరి జిల్లాలో జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆత్మకూరు మండలం పారుపల్లి గ్రామంలో.. శనివారం రాత్రి జరిగిన బతుకమ్మ వేడుకల్లో గ్రామపంచాయతీ ఆవరణలోనే సర్పంచ్ రమేష్‌తో పాటు మరి కొందరు మద్యం బాటిళ్లు పెట్టి ‘సారా సారమ్మ’ అంటూ డీజే పెట్టి బాటిళ్ల చుట్టూ బతుకమ్మ ఆటలు ఆడారని గ్రామానికి చెందిన మహిళలు ఆరోపించారు. అంతేకాదు దీనికి సంబంధించిన ఫోటోలు,వీడియోలు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆడపడుచులు.. తెలంగాణ సంప్రదాయాన్ని, బతుకమ్మ పండుగను కించపరుస్తూ మద్యం బాటిళ్లతో డ్యాన్స్‌లు చేసిన సర్పంచ్‌, ఇతర నేతలపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న వీడియోపై పారుపల్లి గ్రామ సర్పంచ్ రమేష్‌ వివరణ ఇచ్చకున్నారు. అవి బతుకమ్మ సంబురాలు కావని, ఓ బర్త్‌డే పార్టీలో విందు చేసుకున్నామని.. ఆ సమయంలో గిట్టని వారు వీడియో తీసి సోషల్‌మీడియాలో పెట్టారన్నారు.