బీజేపీకి దూరమైనా.. హిందుత్వను వీడలేదు.. ఉధ్ధవ్ థాక్రే

బీజేపీకి తాము దూరమైనా.. హిందుత్వను వీడలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతీయ జనతా పార్టీ హిందుత్వ కాదని, అది మరో అంశమని అన్నారు.

బీజేపీకి దూరమైనా.. హిందుత్వను వీడలేదు.. ఉధ్ధవ్ థాక్రే
Follow us

| Edited By: Pardhasaradhi Peri

Updated on: Mar 07, 2020 | 4:08 PM

బీజేపీకి తాము దూరమైనా.. హిందుత్వను వీడలేదని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉధ్ధవ్ థాక్రే స్పష్టం చేశారు. అయోధ్యలో శనివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. భారతీయ జనతా పార్టీ హిందుత్వ కాదని, అది మరో అంశమని అన్నారు. ఏమైనా.. హిందూత్వకు మాత్రం తాము దూరం కాలేదన్నారు. అయోధ్యలో రామాలయ నిర్మాణానికి తమ ప్రభుత్వం కోటి రూపాయల విరాళం ఇస్తుందని ఆయన ప్రకటించారు. గత ఏడాది డిసెంబరులో సీఎం అయ్యాక మొదటిసారిగా అయోధ్యను సందర్శించారు ఉధ్ధవ్.. గతంలో చివరిసారి తాను ఇక్కడికి వచ్చినప్పుడు.. రామాలయ నిర్మాణంపై అయోమయ పరిస్థితి నెలకొని ఉందని ఆయన గుర్తు చేశారు. 2018 నవంబరులో ఈ ప్రాంతాన్నివిజిట్ చేశానని, అయితే గత ఏడాది నవంబరులో సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు ప్రకటించిందని, తాను దాదాపు అదే సమయంలో ముఖ్యమంత్రిని అయ్యానని ఆయన చెప్పారు. ‘మూడో సారి ఇక్కడికి వచ్చాను. అయోధ్యను నేను ఎప్పుడు సందర్శించినా ఇక్కడ నాకు శుభ సమాచారం లభిస్తోంది’ అని ఆయన వ్యాఖ్యానించారు.

ఇక్కడ గుడి నిర్మాణంపై నేను యూపీ  సీఎం యోగిఆదిత్యనాథ్ తో మాట్లాడాను. ఆలయ నిర్మాణం జరగడం తథ్యమని అన్నాను. అయితే ఈ గుడి నిర్మాణానికి తోడ్పడే భక్తులకోసం ఏదైనా కొంత స్థలాన్ని కేటాయించాలని కోరాను’ అని ఉధ్ధవ్ థాక్రే తెలిపారు. కాగా-అయోధ్యలో జరిగే హారతి కార్యక్రమంలో ఉధ్ధవ్ కూడా పాల్గొనవలసి ఉన్నప్పటికీ.. కరోనా కారణంగా దాన్ని రద్దు చేసుకున్నారు.

24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
24 గంటల్లో 120 పబ్బుల్లో తాగేశాడు- గిన్నిస్ రికార్డ్ కొట్టేశాడు..
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
ఏపీలో అభ్యర్థుల ఆస్తి, అప్పుల చిట్టా ఇదే.. టాప్‎లో ఉన్నది ఎవరంటే
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
కూటమి నేతల్లో కలవరపెడుతున్న అసమ్మతి కుంపటి.. తెరపైకి రాజకీయ వేడి
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. హైదరాబాద్‌లో తులం ఎంతంటే.?
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
దిన ఫలాలు (ఏప్రిల్ 20, 2024): 12 రాశుల వారికి ఇలా..
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
రాహులో రాహులా! లక్నో కెప్టెన్ సూపర్ ఇన్నింగ్స్.. చెన్నై చిత్తు
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
మూడేళ్లు.. 215 మ్యాచ్‌లు.. ఐపీఎల్ నుంచి సూపర్ ఓవర్ మాయమైనట్లేనా?
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
తండ్రయ్యాక ఆ అలవాట్లకు పూర్తిగా గుడ్ బై చెప్పేసిన హీరో నిఖిల్
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
మహేష్ బిజినెస్ కి జక్కన్న హెల్ప్ చేస్తున్నారా ??
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు
ఉత్తర దక్షిణాలను కలుపుతున్న ఆధ్యాత్మిక అంశాలు